ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ - Food distribution With Helicopters

Food Distribution Through Helicopters: విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జోరుగా సాగుతోంది. సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలని, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ఆహార పంపిణీ చేస్తున్నారు. వాయు సేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులు, ఇతర అత్యవసర వస్తువులను వరద ప్రాంతాల్లో జార విడుస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 200ల మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.

Food Distribution Through Helicopters
Food Distribution Through Helicopters (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 11:54 AM IST

NDRF Team Help to Krishna River Flood Victims: కృష్ణా జిల్లా విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 200ల మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల సాయంతో తాగునీరు, శక్తినిచ్చే పానీయాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను అధికారులు తరలిస్తున్నారు.

బాధితులకు తక్షణ సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యేందుకు బయట నుంచి కూలీలను కూడా తరలించారు. వరద తగ్గుముఖం పట్టడంతో వీలైనంత త్వరగా ఆహారం, తాగునీరు, ఇతర తక్షణ సహాయక చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

Food Distribution Through Helicopters: హెలికాప్టర్​ల ద్వారా వరద ముంపు ప్రాంతాల్లో ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. వాయు సేనకు చెందిన హెలికాప్టర్ ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను సిబ్బంది జార విడుస్తున్నారు. సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలని, రాజరాజేశ్వరి పేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఆహారం హెలికాప్టర్​ల ద్వారా వాయుసేన సిబ్బంది జారవిడుస్తున్నారు.

వరద బాధితులకు పటిష్ట సహాయ చర్యలు - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ - first time used drones in ap

ABOUT THE AUTHOR

...view details