Flood Water Increasing in Munneru River :ఐతవరం గ్రామం వద్ద మునేరు వరద ఉద్ధృతిని నందిగామ ఆర్డీవో రవీందర్ రావు పరిశీలించారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మున్నేరు వరద ప్రవహిస్తుండటంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. మునేరు కొద్దిగా వరద తగ్గినప్పటికీ జాతీయ రహదారిపై ప్రవహిస్తుంది. దీంతో వాహనాలు రాకపోకలను పూర్తిగా నిషేధించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మునేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వాహనాల రాకపోకలకు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు మునేరుకు భారీగా వరద వస్తుంది. వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో కీసర టోల్ గేట్ వద్ద ప్రయాణీకుల అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులకు పరిటాల రాము ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు.
భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం చుట్టూ వరద పోటెత్తింది. మునేరుకు పెద్దఎత్తున వరద చేరటంతో మార్కెట్ యార్డ్ ఆవరణలో మూడు అడుగులకుపైగా నీరు చేరింది. రెండు 108వాహనాలు వరదలో చిక్కుకుపోయాయి. వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో నీరు నిలిచిపోయింది. నందిగామ- మధిర రోడ్డుపై మునేరు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి.