Flood Flow to Telangana Water Projects :నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 532.5 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు ప్రస్తుతం నీటినిల్వ 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి విడుదల చేయనున్నారు.
దిగువన కర్ణాటక నుంచి ప్రవాహం నిలకడగా సాగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 3.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 45 గేట్లు ఎత్తి 3.19 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.92 టీఎంసీలకు చేరింది. అటు శ్రీశైలంలోనూ 10 గేట్లు ఎత్తి 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా నమోదైంది.
మరోవైపు భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది. గురువారం ఉదయానికి 42.9 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్వల్ప వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 5,166 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం1076.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు అయితే ప్రస్తుతం నిల్వ 36.464 టీఎంసీలుగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - నిండుకుండలా మారిన ప్రాజెక్టులు - Telangana Dams With Full Water
నీటి తరలింపు :ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నీటి తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 10,600 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.70 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు 13 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. మిడ్‌మానేరు పూర్తిస్థాయి నీటిమట్టం 27 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 11 టీఎంసీలకు నీరు చేరింది.
సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టుకు 991 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 391 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిసామర్థ్యం 14.6 టీఎంసీలకు నీరు చేరింది.
నిర్మల్ జిల్లా కడెం నారయణ రెడ్డి జలాశయానికి వరద నీరు చేరుతుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి జలాశయానికి వరద ప్రవహిస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 696 అడుగులకు చేరింది. నీటి పూర్తి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.999 టీఎంసీలుగా ఉంది. జలాశయంలోకి 6వేల 724 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 2 వరద గేట్ల ద్వారా 5వేల 798 క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద ప్రవాహంతో గోదావరి పరవళ్లు - నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు - Irrigation Projects in Telangana
ప్రాజెక్టులకు జలకళ - భద్రాచలం వద్ద 26 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - Telangana Irrigation Projects