Flood Alert at Prakasam Barrage : ఏపీలో రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. విజయవాడ వంటి పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వరద విజృంభించి పలు ప్రాంతాలను జలదిగ్బంధం చేసింది. ఇంకా చాలా ప్రాంతాలు వరద నీటిలోనే చిక్కుకుని ఉన్నాయి. ఏకధాటిగా కురిసిన వానకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగి పొర్లాయి. మరోవైపు పలు నీటిపారుదల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
Prakasam Barrage Gates Opened :ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద పోటెత్తింది. పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో అధికారులు 70 గేట్లను ఎత్తి 11.38 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 24.3 అడుగుల మేర కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నట్లు చెప్పారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ముంపు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఖమ్మం జిల్లాకు బయల్దేరిన సీఎం రేవంత్ - సూర్యాపేటలో ఆగి వరదలపై సమీక్ష - CM REVANTH KHAMMAM VISIT UPDATES
వరద ఉద్ధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌పై పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపేశారు. మరోవైపు బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రజలు, వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. ఈ నాలుగు బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది.
నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యసాధ్యాలపై, అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడుని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకువస్తున్నారు. ఆయన ఇరుక్కుపోయిన బోట్లు, బ్యారేజి పటిష్టతను పరిశీలిస్తారు. కన్నయనాయుడు సలహా మేరకు బోట్లు తీసే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదలతో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. యనమలకుదురు సమీపంలో రక్షణగోడకు సమాంతరంగా వరద ప్రవహిస్తోంది. రక్షణగోడకు పైబడి నీరు ప్రవహిస్తే పలు కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. ఈ నాలుగు బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది.నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యసాధ్యాలపై, అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడుని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకువస్తున్నారు. సుమారు 8 గంటల సమయంలో ఇరుక్కుపోయిన బోట్లు, బ్యారేజి పటిష్టతను పరిశీలిస్తారు. కన్నయనాయుడు సలహా మేరకు బోట్లు తీసే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
'నేనున్నానని.. మీకేం కాదని' - వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన - ap cm Visit Vijayawada flood areas
ముంపు బాధితులారా బీ అలర్ట్ - సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి! - SEASONAL DISEASES PRECAUTIONS