ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరంలో నితిన్​, శ్రీలీల - "చెక్​పోస్టు దాటుకొని దూసుకెళ్లిన వాహనాలు" - FILM SHOOTING AT POLAVARAM

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సినిమా షూటింగ్​ సందడి

Film Shooting In Alluri sitharama Raju District
Film Shooting In Alluri sitharama Raju District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2024, 12:23 PM IST

Updated : Nov 27, 2024, 2:16 PM IST

Film Shooting In Alluri sitharama Raju District :ఎక్కడైనా సినిమా షూటింగ్​ అంటే ఆ ప్రాంతాల్లో సందడి నెలకొంటుంది. ప్రజలంతా అక్కడకు చేరి వినోదం చూస్తుంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సినిమా చిత్రీకరణ జరిగింది. దీంతో అక్కడంతా సందడి నెలకొంది. పోశమ్మగండి వద్ద మంగళవారం ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ఆ చిత్ర బృందం కొన్ని సన్నివేశాలను షూట్​ చేశాారు. హీరో నితిన్, హీరోయిన్‌ శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాలో కొంత భాగాన్ని ఇక్కడ నిర్మిస్తున్నట్లు సమాచారం.

పంటుపై కార్లు :చిత్రీకరణలో భాగంగా ఏపీ టూరిజం శాఖకు చెందిన పంటుపై మూడు కార్లతో పోశమ్మగండి, పూడిపల్లి పరిసర ప్రాంతాల్లో గోదావరి నదిపై షూటింగ్​ నిర్వహించారు. సినిమాలోని సన్నివేశం కోసం పంటుపై ఉన్న కార్లు పంట భూముల్లో నుంచి చెక్‌ పోస్టును దాటుకుని వెళ్తున్నట్లు, గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వెనుక వైపున కొన్ని షాట్స్​ తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ సినిమా షూటింగ్​ జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రతినాయకులు, కొంతమంది రైతులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

Last Updated : Nov 27, 2024, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details