రామోజీరావుకు నివాళులర్పించిన ప్రముఖ దర్శకులు (ETV BHARAT) Directors Paid Tribute to Ramoji Rao :రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయం పట్ల ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు సంతాపం తెలిపారు. రామోజీ రావు పార్థివ దేహం వద్ద రాఘవేంద్రరావు నివాళులర్పించారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రామోజీ తనయుడు, ఈనాడు ఎండీ కిరణ్‌ను హత్తుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
Film Director Teja On Ramoji Rao :సినీ దర్శకుడు తేజ కూడా రామోజీరావుకు సంతాపం తెలిపారు. నివాళులర్పించిన అనంతరం ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినీరంగానికి రామోజీరావు చేసిన విశేష సేవలను కొనియాడారు. ఆయన మరణం తెలుగు జాతికి తీరని నష్టం అని దర్శకుడు తేజ అన్నారు. పత్రిక, సినిమాలు, వ్యాపారం ఎందులోనైనా అత్యన్నత ప్రమాణాలు పాటించేవారని ఆయన కొనియాడారు.
తాను దర్శకుడు కావడానికి రామోజీరావే కారణమని తేజ తెలిపారు. 'చిత్రం' సినిమాను 20 నిమిషాల్లో ఓకే చేశారని చెప్పారు. ఆయన దగ్గర ప్రతి పని పద్ధతి ప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు. తన జీవితంలో చూసిన అతిగొప్ప భారతీయుల్లో రామోజీరావు ఒకరని తేజ అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
Director Boyapati Srinu About Ramoji Rao : ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణం పట్ల దర్శకుడు బోయపాటి సంతాపం తెలిపారు. రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా రామోజీరావుకు సంతాపం తెలియజేశారు. రామోజీ ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విప్లవం తీసుకువచ్చారని బోయపాటి అన్నారు. ఒక లెజెండ్ మన మధ్య నుంచి వెళ్లిపోయారని వాపోయారు. తెలుగు రాష్ట్రానికి ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని చెప్పారు. ప్రతి వ్యాపారంలో అద్భుతాలు చేసి తెలుగువారికి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. లక్షల మందికి ఉపాధి కల్పించారని పేర్కొన్నారు.