Actor Hema Clarity on Rave Party : కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతంలో మే నెలలో జరిగిన ఓ రేవ్ పార్టీలో సినీ నటి హేమ పాల్గొని, పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఏపీ, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు హాజరు కాగా, వారిలో సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్ ఉన్నట్లుగా అప్పట్లో పోలీసులు వెల్లడించారు. పార్టీలో పాల్గొన్న వారితో పాటు 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పట్టుబడిన వారి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపగా, మొత్తం 103 మందిలో 86 మందికి డ్రగ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. పలువురు నటుల రక్త నమూనాల్లోనూ మాదక ద్రవ్యాల ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు, వారిలో తెలుగు నటి సైతం ఉన్నట్లు స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే పాజిటివ్ వచ్చిన తెలుగు నటి పేరు మాత్రం వెల్లడించలేదు. అయినప్పటికీ ఆ నటి హేమ అయి ఉంటారంటూ అప్పట్లో అనేక పుకార్లు షికార్లు కొట్టాయి.
మా అసోసియేషన్ కీలక నిర్ణయం - సినీ నటి హేమ సస్పెండ్! - Maa Association Suspend Hema
వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నటి హేమ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. రేవ్ పార్టీకి సంబంధించి తాను అన్ని పరీక్షలూ చేయించుకున్నానని, ఇటీవల వచ్చిన రిపోర్టుల్లో అన్నింట్లోనూ తనకు నెగిటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అన్ని టీవీ ఛానళ్లకు వెల్లడించానని, అవసరమైతే బహిరంగ టెస్టులకూ తాను సిద్ధమేనంటూ తెలిపారు. ఇకనైనా తనపై అనవసర ఆరోపణలు మానుకోవాలని కోరారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలవాలనుకుంటున్నానన్న ఆమె, అపాయింట్‌మెంట్ ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేశారు.