ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"చెన్నై ఎక్స్​ప్రెస్ మర్డర్ స్టోరీ" - తండ్రీ, కూతురు కలిసి మృతదేహాన్ని ముక్కలు కోసి! - MISSING WOMAN MURDERED

నెల్లూరులో అదృశ్యమైన వృద్ధురాలు హత్య - చెన్నైలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పట్టుకున్న పోలీసులు

missing_woman_murdered
missing_woman_murdered (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 4:57 PM IST

Updated : Nov 5, 2024, 6:29 PM IST

Missing Woman Murdered in Nellore District:నగల కోసం ఓ వృద్దురాలిని నమ్మించి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి సూట్​ కేసులో పెట్టిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. నెల్లూరులో హత్యచేసి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. చెన్నై సమీపంలోని రైల్వే స్టేషన్​లో పట్టుబడటంతో స్కూట్ కేసును పరిశీలించారు. హంతకులు ఇద్దరూ తండ్రి, కూతురుగా పోలీసులు గుర్తించారు. ఆమె వద్ద నున్న బంగారు ఆభరణాలు కోసం హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

నెల్లూరులో నగరంలోని కుక్కలగుంట రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన రమణి(65) అనే వృద్దురాలు సోమవారం ఉదయం కూరగాయలు కొనేందుకు వెళ్లి కనిపించకుండా పోయారు. చుట్టుపక్కల విచారించిన కుటుంబ సభ్యులు, ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తన తల్లి రమణి కనిపించడం లేదని కుమారుడు పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై రైల్వే స్టేషన్ వద్ద సూట్ కేసులో వృద్దురాలి మృతదేహాన్ని పట్టుకున్నట్లు నెల్లూరు పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ మృతదేహం నెల్లూరులో అదృశ్యమైన రమణిదేనని గుర్తించిన పోలీసులు, వృద్దురాలి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లారు.

"చెన్నై ఎక్స్​ప్రెస్ మర్డర్ స్టోరీ" - తండ్రీ, కూతురు కలిసి మృతదేహాన్ని ముక్కలు కోసి! (ETV Bharat)

భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారు: పవన్‌ కల్యాణ్​

సంతపేటలో రమణి ఇంటికి సమీపంలో సుబ్రమణ్యం అతడి కుమార్తె దివ్య నివాసం ఉంటున్నారు. రమణితో వీరు పరిచయం ఏర్పరుచుకున్నారు. మెడలోని నగలు, చేతికి ఉన్న ఉంగరాలు తీసుకుని నెల్లూరులోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎక్కడ వేయాలనేదానిపై చర్చించుకుని ట్రైన్​లో తీసుకుపోయి దూరప్రాంతంలో పడేవేసే విధంగా సూట్ కేసులో పార్సిల్ చేసినట్లు వివరించారు. మూడు రోజులుగా వీరు నగలు కాజేసేందుకు పథకం పన్నినట్లు ఇంక ఈ కేసుకు సంబంధించి కొత్త కోణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు.

తన తల్లి కనిపించడం లేదని ఆమె కుమారుడు పురుషోత్తం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా చెన్నైలో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. సూట్ కేసులో మహిళ మృతదేహం ఉన్నట్లు కొరుకుపేట రైల్వే పోలీసులు సమాచారం ఇవ్వడంతో తమ సిబ్బంది చెన్నై వెళ్లారు. మృతదేహం ఉన్న సూట్ కేసుతో పాటు బాలసుబ్రమణ్యం అనే వ్యక్తిని, ఆయన కుమార్తెను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.- శ్రీనివాసరావు, సీఐ

మంత్రిని చేశాం, అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా?: సీఎం చంద్రబాబు

దేవుడి సొమ్ముతో కాయ్ రాజా కాయ్ - క్రికెట్ బెట్టింగ్​లకు ఆలయాల నిధులు

Last Updated : Nov 5, 2024, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details