ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్టుబడి కూడా వస్తాదన్న నమ్మకం లేదు - కరెంటు కోతలతో అన్నదాతల అవస్థలు - పంటలపై రైతులు ఆందోళన

Farmers Worried Crops Are Drying to Power Cuts: వైసీపీ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలతో రైతులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యుత్ కోతలు పెరిగిపోవటంటతో చేతికి వచ్చే పంట వెన్ను దశలోనే ఎండిపోతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నీరు అందకపోతే దిగుబడి తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతామని రైతులు చెబుతున్నారు.

Farmers Worried Crops Are Drying to Power Cuts
Farmers Worried Crops Are Drying to Power Cuts

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 3:42 PM IST

పెట్టుబడి కూడా వస్తాదన్న నమ్మకం లేదు- కరెంటు కోతలతో అన్నదాతల అవస్థలు

Farmers Worried Crops Are Drying to Power Cuts:వైసీపీ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడాల్సిన దుస్థితి వచ్చింది. వ్యవసాయానికి 9గంటలు కరెంటు ఇస్తున్నామని ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం కనీసం 7గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని నెల్లూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా విద్యుత్ కోతలు విపరితంగా పెరిగిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట వెన్ను దశలో నీరు అందకపోతే దిగుబడి తగ్గి నష్టపోతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

అనధికార కరెంటు కోతలు- ఆందోళనకు దిగిన అన్నదాతలు

No Water in Agricultural lands:నెల్లూరు జిల్లాలో సుమారు 3లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. పంట కోత దశ వచ్చేంత వరకు పూర్తిగా మోటార్‌ బోర్లపైనే ఆధారపడాల్సిందే. కానీ కొన్ని రోజులుగా కరెంటు కోతలు పెరగడంతో రైతుల గుండెల్లో భయం మొదలైంది. వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నా జగన్ సర్కార్ కనీసం ఏడు గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని రైతులు వాపోతున్నారు. అందులోనూ ప్రతి రెండు గంటలకు నాలుగైదు సార్లు ఎల్​ఆర్ పేరుతో అధికారికంగా సరఫరా నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటారు బోర్లపై ఆధారపడిన అన్నదాతలు పంటను కాపాడుకోవడానికి నానాఅగచాట్లు పడుతున్నారు.

"సీఎం జగన్ 9గంటలు కరెంటు ఇస్తామని చెప్పి 7గంటలు మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం పైరు వెన్ను దశలో ఉంది. కరెంటు ఉదయం ఇచ్చి మధ్యాహ్నం 2గంటలకు ఆపేస్తుండటంతో పంట ఎండిపోతుంది. నీరు సరిగా లేక పంట దిగుబడి అవ్వక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.పెట్టుబడి కూడా వస్తాదన్న నమ్మకం కూడా పోయింది. మాకు 9గంటలపాటు పూర్తి కరెంటు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సీఎం జగన్ 9గంటలు కరెంటు ఇస్తున్నామన్నది పూర్తిగా అవాస్తవం." -రైతులు

అయ్యో అన్నదాత..! పొట్ట దశలో ఎండుతున్న పొలాలు.. కంట తడి పెడుతున్న రైతులు

Power Cuts Then No Water in Crops: నెల్లూరుజిల్లాలోని మనుబోలు, కావలి, ఇందుకూరుపేట, మైపాడు, బోగోలు, అల్లూరు, విడవలూరు ప్రాంతాల్లో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో కరెంటు ఇవ్వడంతో రైతులు మోటార్ల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశామని వెన్ను దశలో ఉన్న పంటకు నీరు అందించకుంటే దిగుబడి తగ్గి నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9గంటలు సక్రమంగా కరెంటు సరఫరా చేయకపోతే విద్యుత్ ఉప కేంద్రాల వద్ద ధర్నాలు చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. సాగునీటి కాలువలు సక్రమంగా లేకపోవడం ఒక సమస్యైతే. విద్యుత్ కోతలు మరో సమస్యగా తయారైందని రైతులు వాపోతున్నారు. అనధికారిక కరెంటు కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించటంలేదని అన్నదాతలు వాపోతున్నారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్య ధోరణి వహిస్తోంది.

స్వల్పకాలిక ఒప్పందాలతో అధిక ధరకు విద్యుత్‌ కొంటున్న ప్రభుత్వం-బాదుడే బాదుడు

ABOUT THE AUTHOR

...view details