తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు కడుపు కొట్టిన వానలు - వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు - HUGE CROP DAMAGE IN TELANGANA - HUGE CROP DAMAGE IN TELANGANA

Rains Caused Heavy Loss to Farmers in Telangana : కుంభవృష్టి వానలు రాష్ట్ర అన్నదాతలకు తేరుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. కష్టపడి పండించిన పంట నీట మునగడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమకు పరిహారం చెల్లిస్తే తప్ప తేరుకోలేమని వాపోతున్నారు.

Farmer Lost Due to Heavy Rains in Telangana
Farmer Lost Due to Heavy Rains in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 8:19 AM IST

Farmer Lost Due to Heavy Rains in Telangana : ఊహించని రీతిలో కురిసిన కుంభవృష్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నీట మునిగి రైతన్నలకు గుండెకోతను మిగిల్చాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో వేలాది ఎకరాల్లోని పంట నీటిపాలైంది. సాగు భూముల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో కర్షకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వమే తము ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు.

వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వరదలకు పంటపొలాలకు. ఆపార నష్టం వాటిల్లింది. సూర్యాపేట, హుజూర్‌నగర్, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలపరిధిలోని పలు చెరువులకు గండ్లు పడి కట్టలు తెగి వేలాది ఎకరాల్లోని వేలాది ఎకరాల్లోని పంటపొలాలను వరదనీరు ముంచెత్తింది. వరదపోటుకు వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తేలిన పంటను చూసి రైతు కన్నీరు : ఉమ్మండి వరంగల్‌ జిల్లాలో ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నేలమట్టం అయ్యాయి. కొన్నిచోట్ల నాటిని మిర్చి మొక్కలు కొట్టుకుపోయాయి. మొక్కజొన్న, మిర్చి, పత్తి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. నేల వాలిన మొక్కజోన్న ఏ మాత్రం అక్కరకు రాకుండా బూజు పట్టి పోతుందని తెలిపారు. త్వరలో పంట చేతికి వస్తుందని భావిస్తున్న తరుణంలో కురిసిన వర్షం తమను నట్టేట ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో తేలిన పంటను చూసి అన్నదాతలు బోరున విలపిస్తున్నారు.

పాలేరు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన పంట :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. పాలేరు వాగు ఉద్ధృతికి పలు గ్రామాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వాగు ఉద్దృతికి పంటలు కొట్టుకుపోవడంతోపాటు పొలాల్లోని ఇసుక మేటలను చూసి రైతులు బోరుమంటున్నారు.

"పొలాలు, ఇళ్లు అన్నీ కొట్టుకుపోయాయి. భారీగా పంట నష్టం జరిగింది. పంట నీటి పాలైంది. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. కోట్లలో నష్టపోయాం. ప్రభుత్వం రైతులందరికీ వెంటనే పంట పరిహారం వెంటనే చెల్లించాలని కోరుతున్నాం."- రైతులు

ఎవరిని కదిపినా ఒకటే వ్యథ - ముంపు బాధితులందరిదీ అదే కన్నీటి గాథ - MUNNERU FLOOD VICTIMS PROBLEMS

మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం - పార్వతి బ్యారేజ్​కు పెరుగుతున్న వరద - Flood Inflow To Parvati Barrage

ABOUT THE AUTHOR

...view details