Farmers Revolt Against Merchants Due To Cheating In Purchase Of Lentils :కందుల కోనుగోలులో మోసం చేసిన దళారులు, హమాలీలపై రైతులు తిరగబడ్డ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. తూకాల్లో క్వింటానికి దాదాపు 25 కిలోలు మోసం చేయడంతో పసిగట్టిన రైతులు వారిని నిలదీశారు. దీంతో వారు లారీ, కాటా, బస్తాలను వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన జిల్లాలోని వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో జరిగింది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం " కొంతమంది దళారులు మార్కెట్ ధర కంటే అధిక ధరకు కందులను కొనుగోలు చేస్తామని గ్రామానికి వచ్చారు. మార్కెట్లో క్వింటా కందుల ధర రూ.8 వేలు పలుకుతుండగా తాము రూ. 9,100 ధర ఇస్తామని రైతులను నమ్మించారు. దీంతో రైతులు ఆశ పడి వారికి అమ్మడానికి ఒప్పుకున్నారు. అయితే కందులు కోనుగోలు సమయంలో తూకంలో మార్పులు చేసి 50 కేజీలు తూగాల్సిన చోట 62 కేజీలు తూగేలా చేశారు.