Political Comments in Tirumala Will Not Permitted Says TTD : తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తిరుమల పవిత్ర క్షేత్రమని, ఇది రాజకీయ వేదిక కాదని హెచ్చరించారు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించామని గుర్తు చేశారు.
తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు.
— B R Naidu (@BollineniRNaidu) December 19, 2024
తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగింది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా…
తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.