తెలంగాణ

telangana

'దేవర కథ ఇదేనా? కొరటాల తన స్క్రీన్​ప్లేతో ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకోవడం ఖాయమేనా' - paruchuri gopalakrishna talk devara

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 5:01 PM IST

Devara Part -1 Trailer Telugu Comments : దేవర పార్ట్​-1 ట్రైలర్​ విడుదలైన దగ్గర నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ అంచనాలతో సెప్టెంబర్​ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్​ బిగ్​స్క్రీన్​పై కనిపిస్తుండటంతో ఫ్యాన్స్​​లోనూ ఆత్రుత కనిపిస్తోంది. అయితే దేవర ట్రైలర్​పై తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఒక ప్రత్యేకమైన వీడియోను రిలీజ్​ చేశారు. అది సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

Devara Part -1 Trailer Telugu Comments
Devara Part -1 Trailer Telugu Comments (ETV Bharat)

Paruchuri Gopala Krishna Talks about Devara Trailer : 'సానా పెద్ద కథ సామీ! రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ!' అంటూ ఎన్టీఆర్​ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ట్రైలర్ రిలీజైన విషయం తెలిసిందే. రిలీజైన రోజు నుంచే సినీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్​ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందు రానుంది. దేవర చిత్రం రిలీజ్​కు ముందే ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. బాక్సాఫీసు వద్ద మరోసారి భారీ వసూళ్లను రాబట్టడానికి సిద్ధంగా ఉందంటూ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ హంగామా మొదలెట్టేశారు.

ఆర్​ఆర్​ఆర్​ సినిమా వచ్చిన రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్​ బిగ్​ స్క్రీన్​పై కనబడనున్నారు. రాజమౌళి సినిమా ఆర్​ఆర్​ఆర్​తో పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయిన ఎన్టీఆర్​, ఇప్పుడు దేవరతో ప్రపంచ ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలని అనుకుంటున్నాడు. తాజాగా దేవర ట్రైలర్​పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. సెప్టెంబరు 27న రిలీజ్​ కానున్న దేవర సినిమా టీమ్​కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

రామాయణం స్ఫూర్తితో కథ : దేవర ట్రైలర్​ను చూస్తే రావణాసురుడి కోసం రాముడు సముద్రాన్ని దాటిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని సన్నివేశాలు రూపొందించారేమోనని అనిపిస్తోందని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. రాముడు సముద్రాన్ని దాటినట్లు దేవరలోనూ ఎన్టీఆర్​ పడవపై నిల్చొని సముద్రాన్ని దాటుతున్నట్లు చూపించారన్నారు. చూస్తే సముద్ర తీరప్రాంత నేపథ్యంలో ఇది రానుందని తెలుస్తోందని, ఇందులో మా చిన్న రామయ్య (ఎన్టీఆర్) పాత్రలో గమ్మత్తు ఉన్నట్లు అర్థమవుతోందన్నారు.

సన్నివేశాలను చూస్తే దేవర, భైరవగా కనిపించనున్నాడని అనుకుంటున్నానని, దేవర అంటే హీరో అని అర్థమవుతోందని చెప్పారు. మరి భైరవ విలన్​ వైపు ఉంటాడేమో అని తనకు అనిపించిందని పేర్కొన్నారు. అలాగే హీరోయిన్​తో సరదాగా, అమాయకత్వంగా మాట్లాడడం చూస్తే కొరటాల శివ తన స్క్రీన్​ప్లేతో ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకోవడం ఖాయంగా అనిపిస్తోందని రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పష్టం చేశారు.

డైలాగ్​లోనే సినిమా కథ : ప్రత్యేక వీడియోలో 'రక్తంతో సముద్రం ఎరుపెక్కే కథ' అని అన్నారు. అంటే సముద్రంలోనే యుద్ధం జరుగుతుందని కొరటాల శివ చిన్న డైలాగ్​తోనే సినిమా కథ చెప్పేశారు. మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత కాదు అని డైలాగ్​ ట్రైలర్​ చూసిన ప్రతి ఒక్కరిలో ఆలోచనను తెప్పిస్తోంది. అలాగే దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు.. సరైన ఆయుధమూ దొరకాలి అని అన్నారు. రామాయణంలోనూ రాముడు ఎన్నో బాణాలు ఉపయోగించాడు. అలాగే దేవరలోనూ ఎన్నో ఆయుధాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతీ అంశం రామాయణాన్ని పోలి ఉంటుందని అనిపిస్తోంది. దేవర సూపర్​ హిట్​ అవ్వాలి.' అని పరుచూరి గోపాలకృష్ణ ఆకాంక్షించారు.

'సార్ మీతో సినిమా చేయాలని ఉంది' - కోలీవుడ్ దర్శకుడికి ఎన్టీఆర్ రిక్వెస్ట్​ - Devara NTR

విడుదలకు ముందే దూసుకెళ్తోన్న 'దేవర' - ఆ రికార్డులన్నీ బ్రేక్​! - Devara Movie Records

ABOUT THE AUTHOR

...view details