Famous journalist N Ram Comments in Ramoji Rao Memorial Programme in AP:రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం ఏపీలోని విజయవాడ శివారు కానూరు వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, పాత్రికేయ దిగ్గజాలు ఎన్. రామ్, శేఖర్ గుప్తా తదితరులు హాజరయ్యారు.
రామోజీరావు ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిచయం అయ్యారని ప్రముఖ పాత్రికేయుడు ఎన్.రామ్ తెలిపారు. అప్పటి నుంచి ఆయనతో వ్యక్తిగత పరిచయం పెరిగిందని అన్నారు. రామోజీరావు ఇన్వెస్టిగేషన్ జర్నలిజాన్ని నమ్మేవారని అన్నారు. నమ్మిన విలువల కోసం కట్టుబడేవారని తెలిపారు. అప్పట్లో దేశ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవని ఆ సమయంలో పాత్రికేయుల హక్కులపై రామోజీరావు పోరాడారని ఎన్. రామ్ అన్నారు. అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పరువు నష్టం బిల్లు తెచ్చిందని ఆ బిల్లులో పాత్రికేయులే లక్ష్యంగా కఠిన నిబంధనలు రూపొందించారని తెలిపారు.
అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్