ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య - Family Suicide case - FAMILY SUICIDE CASE

Family Suicide in Kadapa District: కట్టుకున్న భర్త వద్దన్నాడు. భర్త నుంచి రావాల్సిన భరణం కోసం కోర్టుల చుట్టూ తిరిగి జీవితం విరక్తి చెందింది. తనతో పాటు ఇద్దరు పిల్లలు సోదరుడికి భారం కావొద్దని భావించింది. సాయంత్రం గుడికి వెళ్లి వస్తానంటూ పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. చివరిసారి సోదరుడి ఫోన్​కు మెసెజ్​ పంపించి కుమారుడు, కూతురుతో సహా చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన వైఎస్సార్​ జిల్లాలో జరిగింది.

Family_Suicide_in_Kadapa_District
Family_Suicide_in_Kadapa_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 11:38 AM IST

Updated : Apr 29, 2024, 12:52 PM IST

Family Suicide in Kadapa District:ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా, నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా, తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. ఇక చాలు, నీకు భారం కాదలుచుకోలేదు. మా ఆత్మహత్యలకు భర్త శ్రీహరి, అత్త సరస్వతి, ఆడపడుచు శశికళతో పాటు లక్ష్మీపతి కారణమంటూ’ అన్నకు చివరిసారిగా చరవాణి ద్వారా వాయిస్‌ మెసేజ్‌ పంపి బిడ్డలతో సహా తనువు చాలించిన విషాదకర సంఘటన వల్లూరులో సోమవారం చోటు చేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

పోలీసుల వివరాల ప్రకారం చెన్నూరు మండలం గొర్లపుల్లయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరి (45)కి కడప నగరానికి చెందిన శ్రీహరితో 2005లో వివాహమైంది. వీరికి కుమారుడు ఫణికుమార్‌ (17) కుమార్తె ధనలక్ష్మి (16) ఉన్నారు. కాపురం సజావుగా సాగుతున్న క్రమంలో శ్రీహరి జీవనోపాధికి కువైట్‌ వెళ్లాడు. ఈ క్రమంలో కుటుంబంలో మనస్పర్థలు రావడంతో గొడవలు తీవ్రమై ఉమామహేశ్వరి తనకు వద్దంటూ భర్త వాదనకు దిగాడు. దీంతో ఉమామహేశ్వరి తన పిల్లలతో కలిసి 12 ఏళ్లుగా చెన్నూరులోని తన అన్న రాజేంద్రప్రసాద్‌ ఇంట్లోనే ఉంటున్నారు. ఫణికుమార్‌ మోటారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ధనలక్ష్మి ఇంటర్‌ పూర్తి చేసింది. చెల్లెలి కాపురాన్ని నిలబెట్టేందుకు రాజేంద్రప్రసాద్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భర్త కువైట్‌ నుంచి వచ్చాక ఉమామహేశ్వరిని కాపురానికి తీసుకెళ్లకపోవడంతో గొడవలు తీవ్రమై కోర్టుకు వెళ్లారు.

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

అప్పుపై కోర్టులో కేసు వేసి తన పరువు తీశాడని సెల్ఫీ సూసైడ్- మచిలీపట్నంలో కలకలం

ఉమామహేశ్వరి తన భర్త నుంచి చట్ట ప్రకారం రావాల్సిన డబ్బు కోసం కోర్టును ఆశ్రయించారు. రూ.10 లక్షల నగదు ఇవ్వాలంటూ కోర్టు శ్రీహరిని ఆదేశించింది. అంత నగదు చెల్లించలేనంటూ నెలరోజుల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఉమామహేశ్వరి భరణం కోసం మరోమారు కోర్టు మెట్లెక్కింది. కొంత మొత్తం భరణం చెల్లించాలని కోర్టు శ్రీహరిని ఆదేశించింది. ఈ క్రమంలో ఉమామహేశ్వరి కోర్టుల చుట్టూ తిరిగి జీవితంపై విరక్తి చెంది తనువు చాలించాలని నిర్ణయించుకుంది.

గుడ్లూరు ఎస్సై వేధింపులు - వ్యక్తి ఆత్యహత్య - స్టేషన్​ ఎదుట బంధువుల ఆందోళన

ఈ నెల 27న సాయంత్రం గుడికి వెళ్లి వస్తానంటూ పిల్లలతో సహా ఇంటి నుంచి వచ్చేసింది. అదే రోజు రాత్రి 10 గంటలకు రాజేంద్రప్రసాద్‌కు ఫోన్​ ద్వారా మెసేజ్‌ పంపించి కుమారుడు, కూతురుతో సహా చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం పశువుల కాపరులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

నలుగురి ఉసురు తీసిన గొలుసుకట్టు వ్యవహారం - ప్రధాన నిందితుడు అరెస్ట్​ - Tangutur Suicide Case Updates

Last Updated : Apr 29, 2024, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details