Fake Doctors In Hyderabad : కొన్ని అంతరాష్ట్ర ముఠాలు నగరంలో వృద్దులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా ప్రార్ధన మందిరాలు, ఉద్యానాలకు వచ్చే వృద్దులతో మాటలు కలిపి వ్యాధుల గురించి సమాచారం సేకరిస్తారు. తెలిసిన వైద్యులు ఉన్నారని వారి వద్ద చికిత్స తీసుకుంటే ఎంతటి జబ్బులైనా తగ్గిపోతాయని నమ్మిస్తారు. ఇలా నకిలీ డాక్టర్లు హైదరాబాద్‌లో చాలా మందిని మోసం చేసి లక్షల్లో డబ్బులు కాజేశారు.
ఆయుర్వేద మందులు ఇప్పిస్తానంటూ : తాజాగా బంజారాహిల్స్‌లో ప్రొస్టేట్ సమస్యతో భాదపడుతున్న వృద్దుడికి ఆయుర్వేద మందులు ఇప్పిస్తానంటూ 20లక్షలు కొట్టేశాడు. అబిడ్స్‌లో తలనొప్పి భాదిత మహిళ వద్ద మాయగాడు రూ.40వేలు తీసుకొని విటమిన్ మాత్రలు ఇచ్చారు.
కాలిలో చీము తీస్తానని మోసం: స్కందగిరి పరిధిలో వయోధికుడు కుంటుతూ నడవటం ఆ మోసగాడు గమనించాడు. అతడి వద్దకెళ్లి నడకలో మార్పునకు కారణాలు అడిగి తెలుసుకున్నాడు. కాలిపై ఉన్న పుండును బేగంబజార్‌లోని వైద్యుడు తగ్గిస్తాడంటూ నమ్మేలా చేశాడు. ఇంటి అడ్రస్ తీసుకొని రెండు రోజుల తర్వాత వెళ్లి కాలిలో చీము తొలగించాడు. భవిష్యత్తులో ఈ సమస్య రాదని భరోసా ఇచ్చాడు. వైద్యానికి రూ.2లక్షలు ఖర్చవుతాయని తెలిపాడు.