Excise Department Checks on Drug Traffic : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ ముమ్మరంగా దాడులు చేసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి నేతృత్వంలోని బృందాలు నాలుగు నెలలుగా జరిపిన దాడుల్లో ఏకంగా రూ.39.15 కోట్ల విలువైన సారా, దాని తయారీ పదార్థాలతో పాటు రూ.7.2 కోట్ల విలువైన గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
Country Liquor Seized in Telangana :ఇందులో ఒక్క ఏప్రిల్ మాసంలోనే రూ.33.5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల సరకును పట్టుకున్నారు. ఈ మాదక ద్రవాలపై మొత్తం 9,145 కేసుల్లో 4,010 మందిని నిందితులుగా గుర్తించారు. మత్తు దందాపై ఆబ్కారీశాఖ నిఘా తీవ్రతరం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై దాడులు ముమ్మరం చేసింది.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి నేతృత్వంలోని బృందాలు నాలుగు నెలలుగా అనేక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఏకంగా రూ.39.15 కోట్ల విలువైన సారా, దాని తయారీ పదార్థాలను పట్టుకున్నారు. దీంతో పాటు రూ.7.2 కోట్ల విలువైన గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను జప్తు చేశారు. ఇందులో ఒక్క ఏప్రిల్‌లోనే రూ.33.5 కోట్ల విలువైన సరకును పట్టుకున్నారు. 4 నెలల్లో మొత్తం 9,145 కేసుల్లో 4,010 మందిని నిందితులుగా గుర్తించారు.