తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో దారుణం - చిన్నపిల్లలే లక్ష్యంగా విస్కీతో ఐస్​క్రీమ్ తయారు చేసి విక్రయం - Whiskey Ice cream

Whiskey IceCream Rocket Arrest : ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడని పిల్లలే ఉండరు. దీన్నే అవకాశంగా మార్చుకున్న జూబ్లీహిల్స్‌లోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ యజమానులు వాటిలో మద్యం కలిపి విక్రయాలు సాగిస్తున్నారు. ఇవి తిని మత్తుకు బానిసయ్యే చిన్నారులు, మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తారనే అత్యాశతో వక్రమార్గం పట్టారు. సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ అమ్మకాలకు పాల్పడుతుండటంతో దాడులు చేసిన ఎక్సైజ్‌ పోలీసులు పార్లర్‌ యజమానుల్ని అరెస్ట్‌ చేశారు.

Whiskey IceCream Rocked Busted in Hyderabad
Whiskey IceCream Rocket Arrest (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 6:10 PM IST

Updated : Sep 6, 2024, 8:01 PM IST

Whiskey IceCream Rocked Busted in Hyderabad :ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి కలకలం సృష్టిస్తున్నవేళ తాజాగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో విస్కీ ఐస్‌ క్రీమ్‌లు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మత్తుపై ఉక్కుపాదం మోపుతామని సర్కారు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నా మార్పు రావడం లేదు. ఏకంగా సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుని విస్కీ ఐస్‌ క్రీమ్‌లు విక్రయాలు చేస్తుండగా ఎక్సైజ్‌ టాస్క్‌పోర్స్‌ పోలీసులు దాడులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

చిన్నపిల్లలే లక్ష్యంగా విస్కీ ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. కిలో ఐస్ క్రీమ్‌లో 60 ML విస్కీ కలుపుతున్నట్లు గుర్తించామని, నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతామని అధికారులు తెలిపారు. పూర్తి ఆధారాలు సమర్పించి నిందితులకు కఠినంగా శిక్షపడేలా చూస్తామని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. 21 ఏళ్లు దాటిన వారికే మద్యం విక్రయాలు చేయాలని చట్టాలు చెబుతున్నా వాటన్నింటినీ అతిక్రమించి ఏకంగా చిన్నారులే లక్ష్యంగా విస్కీ ఐస్‌క్రీమ్‌లు అమ్మడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.

'జూబ్లీహిల్స్‌లో రోడ్​ నంబర్​ 5లో తనిఖీలు నిర్వహించాం. ఓ చాక్లెట్​ ఐస్​క్రీమ్​ వంద శాతం వీస్కీ కలిపినట్లు గుర్తించాం. ఆల్కహాల్​తో ఐస్​క్రీమ్ తయారు చేయడం, పైగా విక్రయించడం చట్టరీత్యా తప్పు. అందుకు మేం వాటిని సీజ్​ చేశాం. చెఫ్​ను అసిస్టెంట్​ను అరెస్టు చేశాం. విస్కీ ఐస్‌ క్రీమ్‌లు తయారు చేస్తున్నారని తెలుస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఐస్‌ క్రీమ్‌లు తయారు చేసే చివరి దశలో వీస్కీ కలుపుతున్నారు. ఇదీ పిల్లల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది'- ప్రదీప్‌ రావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌

ఐస్ క్రీమ్ పార్లర్​పై తనిఖీలు : ఐస్‌క్రీమ్‌లో వీస్కీ కలిపి విక్రయాలు జరుపుతున్న ముఠాపై దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరిలించామని ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఖురేషి తెలిపారు. జూబ్లీహిల్స్​లోని 1 కిలో ఐస్​క్రీమ్​లో విస్కీ కలుపుతూ చిన్నపిల్లల భవిష్యత్తుకు కష్టం కలిగించే అటువంటి ఐస్ క్రీమ్ పార్లర్​పై తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో విస్కీ కలిపిన 11.5 కేజీల ఐస్ క్రీమ్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో అనేక మార్లు ఏఓపీ నుంచి వస్తున్నటువంటి గంజాయిని సైతం పట్టుకున్నామని, ఇదే తీరులో గురువారం ఖమ్మంలో 59 కేజీల గంజాయిని పట్టుకున్నారని ఖురేషి వెల్లడించారు.

Last Updated : Sep 6, 2024, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details