బీఎస్పీతో పొత్తు ఎఫెక్ట్ - బీఆర్ఎస్ను వీడే యోచనలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప! - Ex MLA Koneru Konappa News Latest
Ex MLA Koneru Konappa News Latest : సిర్పూర్ కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని ముఖ్యనేతలను హైదరాబాద్‌కు పిలిపించి మంతనాలు జరుపుతుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రానికి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది
Published : Mar 6, 2024, 11:50 AM IST
Ex MLA Koneru Konappa News Latest :బీఆర్ఎస్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన అనుచరులతో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను హైదరాబాద్‌కు పిలిపించి వారితో మంతనాలు జరుపుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును కోనప్ప, అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేశారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నందు బీఆర్ఎస్లో కొనసాగలేనని కోనప్ప అంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ను వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రానికి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది