Ex minister KTR Attended ED Interrogation :ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. నాలుగు గంటల నుంచి ఆయన విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. బాష్పవాయువు, వాటర్ కెనాన్ల వాహనాలు తెప్పించారు.
వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరు కావాల్సి ఉన్నా, తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫార్ములా-ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది.