Pinnelli Ramakrishna Reddy defeat in Macherla: మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది! ఔను మీరు విన్నది నిజమే.! బ్రిటీషర్లను పోలిన నియంతృత్వం, దోడిపీ ముఠాలను మించిన దౌర్జన్యం, గిట్టని వాళ్లను ఊళ్ల నుంచి వెళ్లగొట్టే రాక్షసత్వం నుంచి మాచర్లకు విముక్తి లభించింది.! ఒకటా? రెండా? దాదాపు 15ఏళ్లపాటు పిన్నెల్లి అరాచకాల మధ్య మగ్గిన నియోజకవర్గం ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్యాన్ని తన పాదాలకింద తొక్కేసిన మాచర్ల మారీచుడిని జనం ఇంటికి పంపారు.
2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లు వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలోకి వెళ్లారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పిన్నెల్లి విజయం సాధించారు.! వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని పిన్నెల్లి, తన సొంత సామ్రాజ్యంలా మార్చుకున్నారు. తాను చేప్పిందే చట్టం, చేసిందే శాసనం అన్నట్లు చెలరేగారు. చివరకు రాజకీయం కూడా తాను తప్పితే ఎవరూ చేకూడదనే, స్థాయికి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని నామినేషన్ కూడా వేయనీయలేదు. మాచర్ల మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ ఏకగ్రీవం చేశామని విర్రవీగారు. ఇదేం అరాచకం అంటూ అక్కడికి వెళ్లిన తెలుగుదేశం నిజ నిర్థరణ బృందంపై దాడి చేశారు. సెంట్రింగ్ కర్రతో మాచర్ల నడిబొడ్డునే వెంటాడి కారుపై దాడి చేశారు.
'ఆ విషయంలో నా లెక్క తప్పింది' - ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో - Venu Swamy on AP Election Results
మాచర్ల నియోజకవర్గంలో ఉండాలంటే పిన్నెల్లికి తలొంచాలి.! లేదంటే తలదించాలి. లేదంటే ఊరొదిలి వెళ్లిపోవాలి. గత ఐదేళ్లలో.. నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల్లో తెలుగుదేశం నేతలు అలా వెళ్లిపోయారు. వాళ్లందరికీ పిన్నెల్లిని ఎదిరించాలనే కసి ఉంది. కాకపోతే వారికి అండగా నిలిచే, బలమైన శక్తి కోసం ఎదురుచూశారు. తెలుగుదేశం అధినాయకత్వం అండతో, పార్టీ శ్రేణుల మద్దతుతో జూలకంటి బ్రహ్మారెడ్డి రూపంలో, మాచర్ల పసుపుసైన్యానికి తోడుగా ఒక బలమైన నాయకుడు నిలబడ్డాడు. బ్రహ్మారెడ్డి రాకతో, చాలా మంది కార్యకర్తలు ధైర్యం కూడదీసుకుని ఎన్నికల ముందు మళ్లీ స్వగ్రామాలకు వచ్చారు. కార్యకర్తలే ఆర్థిక సాయం చేసి బ్రహ్మారెడ్డిని నిలబెట్టారు. పోతే ప్రాణం వస్తే ప్రజాస్వామ్యం అనుకుని తెగించి పోరాడారు. పోలింగ్ రోజు పసుపు సైన్యంలో అదే తెగువ కనిపించింది. గొడ్డలి వేటు పడినా, మహిళా నేత మంజుల వెనక్కి తగ్గలేదు. ఈవీఎం ను ధ్వంసం చేసిన పిన్నెల్లికి, పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం లోపల టీడీపీ ఏజంట్ నంబూరి శేషగిరిరావు, పోలింగ్ బూత్ బయట మహిళలు తిరుగుబాటు అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఆ రోజే పిన్నెల్లి ఓటమి ఖాయమైంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో అధికారికమైంది. పిన్నెల్లికి ప్రజా కోర్టులో శిక్ష పడింది. ఈ ఓటమితో పిన్నెల్లి పోయేది ఇంటికి కాదు నేరుగా జైలుకే.! ఈవీఎం ధ్వంసం సహా పోలింగ్ రోజు దాడులు చేయించిన కేసుల్లో ఈ నెల 6 వరకూ హైకోర్టు నుంచి రక్షణ పొందిన పిన్నెల్లికి ఆ తర్వాత ఏ క్షణమైనా సంకెళ్లు వేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
ఎన్నికల ఫలితాలు ఊహించలేదు- ఆశ్చర్యం కలిగించాయి: వైఎస్ జగన్ - CM YS Jagan reacted to AP election results
పిన్నెల్లి ఓటమితో మాచర్లకు స్వాతంత్య్రం (ETV Bharat)