తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్స్ విక్రయిస్తూ ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్టు - drugs case in hyderabad - DRUGS CASE IN HYDERABAD

Engineering Students Sell Drugs : ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ విక్రయిస్తూ, పోలీసులకు పట్టుబడిన ఘటన మాదాపూర్‌లో చోటుచేసుకుంది. వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రూ. 4.2లక్షల విలువ చేసే 28 గ్రాములు ఎండీఎంఏ మత్తుపదార్ధాలను, రెండు చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు.

Engineering Students Sell Drugs
Madhapur Drugs Caught Case

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 7:26 PM IST

Madhapur Drugs Caught Case :మాదాపూర్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్ధులను ఎస్‌ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరువురిని రాజమండ్రికి చెందిన గుత్తుల శ్యాం బాబు, కాటూరి సూర్య కుమార్‌లుగా గుర్తించారు. విద్యార్థులిద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు, వారి నుంచి రూ. 4.2 లక్షల విలువ చేసే 28 గ్రాములు ఎండీఎంఏ, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Engineering Students Sell Drugs

గోవా నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్ - పక్కా సమాచారంతో అరెస్టు చేసిన పోలీసులు - Drugs Seized in Hyderabad

Drugs Caught in Hyderabad :ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్లిన సూర్య కుమార్​కు అక్కడ అభి అనే వ్యక్తికి కలిశాడు. అతని ద్వారా డ్రగ్స్ సరఫరాదారుడు నైజీరియన్ దేశస్తుడైన గాడ్‌ ఆఫ్‌ సోల్మెన్ పరిచయం అయ్యాడు. సోల్మెన్ ద్వారా తరచూ డ్రగ్స్ తెప్పిస్తున్న సూర్య కుమార్ రాజమండ్రిలోని అతని చిన్ననాటి స్నేహితుడు గుత్తుల శ్యామ్‌కి కూడా డ్రగ్స్‌ను అలవాటు చేశాడు. కాగా రెండు రోజుల క్రితం బెంగళూరు వెళ్లి 30గ్రాముల ఎండీఎంఏ(MDMA) డ్రగ్ తెచ్చిన సూర్య, అతని స్నేహితుడిని హైదరాబాద్‌కి పిలిచాడు.

రెండు గ్రాముల డ్రగ్స్‌ను ఇద్దరూ సేవించారు. మిగిలిన డ్రగ్స్ రాజమండ్రికి తరలించి అక్కడ విద్యార్ధులకు విక్రయించాలని భావించారు. పక్కా సమాచారంతో నిందితులను మాదాపూర్ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని దర్యాప్తు నిమిత్తం, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్ సరఫరాదారుడు, నైజీరియన్ వ్యక్తి అయిన గాడ్ ఆఫ్ సోల్మెన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా నిందితులు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుమారులుగా గుర్తించారు. వీరిద్దరు విలాసాలకు అలవాటు పడి డ్రగ్స్ దందాలలోకి దిగినట్లు వెల్లడించారు. సూర్య కుమార్ తండ్రి రైల్వే సీనియర్ సూపరింటెండెంట్ కాగా, శ్యామ్ బాబు తండ్రి పోస్టు మాస్టర్ అని దర్యాప్తులో తేలింది. సూర్య కుమార్ గతంలో చందానగర్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. జైలు నుంచి విడుదలై మళ్లీ ఇదే దంగా కొనసాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇరువురు నిందితులు గతంలో ఎవరెవరికి మాదక ద్రవ్యాలు విక్రయించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక రోడ్డు మీదనే "డ్రగ్స్" టెస్టులు! - పోలీసులు ఈజీగా ఇలా పట్టేస్తారు! - Drugs and Drive Tests

అతి పెద్ద డ్రగ్స్ లింక్‌ను ఛేదించిన పంజాగుట్ట పోలీసులు - ఇద్దరు అరెస్టు - Drug Smugglers Arrested

ABOUT THE AUTHOR

...view details