Engineering Student Dies In Road Accident :నగరంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి వాళ్ల ప్రాణాలతో పాటు ఇతరుల చావుకు కారణమవుతున్నారు. తాజాగా నానక్‌రాంగూడ రోటరీ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు బైకును ఢీ కొట్టిన ఘటనలో వెనక కూర్చున్న ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందగా బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
రాయదుర్గం పోలీసుల వివరాల ప్రకారం: కామారెడ్డి దోమకొండకు చెందిన ఐరేని శివాని (21) గండిపేట సీబీఐటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. గండిపేటలో పెయింగ్ గెస్ట్ (పీజీ)గా ఉంటుంది. నిజామాబాద్ నిజాంసాగర్‌లో తాను చదివిన పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించగా, ఆ కార్యక్రమానికి హాజరై స్నేహితులతో సరదాగా గడిపి తిరిగి బస్సులో హైదరాబాద్‌కు వచ్చింది.
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి : జేఎన్టీయూ వద్ద బస్సు దిగిన ఆమెను తన సీనియర్ విద్యార్థి అయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంకట్ రెడ్జి (26) పీజీకి తీసుకెళ్లేందుకు బైక్‌పై ఎక్కించుకొని బయలుదేరాడు. అర్ధరాత్రి సమయంలో నానక్‌రాంగూడ రోటరీ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు వారి బైకును వెనకవైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న విద్యార్థిని గాల్లో ఎగిరిపడింది.