ETV Bharat / state

అనారోగ్య కుమార్తెను కట్టబెట్టావంటూ అల్లుడి వేధింపులు - తట్టుకోలేక మామ ఆత్మహత్య - FATHER SUICIDE ATTEMPT FOR DAUGHTER

కుమార్తెకు అత్తింటి వేధింపులు - చూడలేక ఆత్మహత్యకు యత్నం - ఘటనలో తండ్రి మృతి - కోలుకున్న కుమార్తె

The Father Could Not Bear to See His Daughter's Pain and Drank Poison
The Father Could Not Bear to See His Daughter's Pain and Drank Poison (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 13 hours ago

The Father Could Not Bear to See His Daughter's Pain and Drank Poison : తాను చేసిన పెళ్లి కారణంగా కుమార్తె అత్తింట్లో వేధింపులకు గురవుతుందని ఆవేదనకు గురయ్యాడు ఆ తండ్రి. తన వద్ద అల్లారుముద్దుగా పెరిగిన కుమార్తె అత్తింట్లో బాధలు పడుతోందని తెలిసి చలించిపోయాడు. తల్లైనా ఆమె నుంచి పసికందును అత్తింటివారు దూరం చేయడాన్ని భరించలేకపోయాడు. ఇదంతా చూడడం తన వల్ల కాదనుకుని కుమార్తెకు విషం ఇచ్చి తాను తిన్నాడు.

అనారోగ్య సమస్యను సాకుగా చూపించి కుమార్తెను భర్త వేధిస్తుండడం, అతనికి అత్తమామలు తోడవడంతో ఆ మహిళ కుమిలిపోయింది. కుమార్తె పరిస్థితిని చూసి ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఆమెను ఈ పరిస్థిని నుంచి బయటకు తీసుకురాలేను అనుకున్నాడో ఏమో కానీ చావే మార్గమనుకున్నాడు. కుమార్తెకు విషం పెట్టి తనూ తినగా, తండ్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

'నన్ను పెళ్లి చేసుకో - లేదంటే చచ్చిపో' - మహిళ వేధింపులతోనే ఎస్సై ఆత్మహత్య

బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా కూచనపల్లికి చెందిన జగన్మోహన్‌రెడ్డి జూబ్లీ బస్‌ స్టాండ్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అల్వాల్‌ రిట్రీట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సూరారం కాలనీకి చెందిన మహేందర్‌ రెడ్డి కుమారుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తన కుమార్తె స్నేహను మహేందర్‌ రెడ్డి కుమారుడైన నవీన్‌కు ఇచ్చి 2021లో పెళ్లి చేశారు. తర్వాత దంపతులిద్దరు అమెరికా వెళ్లారు. వాళ్లకు కుమార్తె జన్మించింది.

పాపతో పుట్టింటికి పంపించి : కొంతకాలం ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో భర్త వేధింపులు మొదలెట్టాడు. నెలన్నర పాపతో భార్యను 6నెలల క్రితం పుట్టింటికి పంపించేశాడు. అత్తమామలు స్నేహవద్దకు వస్తూ వేధించేవారు. కొంతకాలం తర్వాత తీసుకెళ్లిపోయారు. ఈ నెల 12న స్నేహకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించిన తండ్రి ఇంటికి తీసుకొస్తూ మధ్యలో ఆహారం తీసుకున్నారు. దారిలో పురుగుమందు కలుపుకుని ఇద్దరూ తిన్నారు. ఇంటికి వచ్చేసరికి ఇద్దరికీ వాంతులవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తండ్రి మరణించగా కుమార్తె కోలుకుంది.

ఆన్​లైన్​లో విషం తెప్పించుకొని - సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఆత్మహత్య

దారుణం - భార్య, కుమారుడిని హతమార్చి ఆత్మహత్య చేసుకున్న సిరాజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.