BEL Job Notification 2024 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఫిక్సెడ్ టర్మ్ ప్రాతిపదికన 229 ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ధర రూ.400+జీఎస్టీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు. దరఖాస్తుకు చివరి తేదీ 10.12.2024. ఈ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్-20, ఓబీసీ-61, ఎస్సీ-32, ఎస్టీ-17, అన్‌రిజర్వుడ్-99 కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రిల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అర్హత, ఎంపిక విధానం : బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) 65 శాతం మార్కులతో ఉత్తీర్ణతై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మాములుగా పాసైతే సరిపోతుంది. వయసు 01.11.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఈ జాబ్‌కు ఎంపిక చేస్తారు.
పరీక్షలో 85 మార్కులు :పరీక్షను 85 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రంలో జనరల్ ఆప్టిట్యూట్, టెక్నికల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాంప్రహెన్షన్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, అనలిటికల్, లాజికల్ రీజనింగ్, బేసిక్ న్యూమరాలజీ జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను పరీక్షించేలా ప్రశ్నలు ఇస్తారు.