Shanti Husband About MP Vijayasai Reddy: తన భార్యకు పుట్టిన కుమారుడి విషయంలో వివాదం తీరాలంటే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ డీఎన్‌ఏ టెస్టుకు రావాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త మదన్‌మోహన్ డిమాండ్ చేశారు. దళిత, గిరిజన, బహుజన సంఘాల నేతలతో కలిసి మదన్‌మోహన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
తమ భార్య శాంతికుమారి విశాఖపట్నంలో కుమారుడికి జన్మనిచ్చిందని, ఆ సమయంలో తాను అమెరికాలో ఉన్నానని తెలిపారు. తాను వచ్చి ఆ గర్భానికి కారణమేంటని ప్రశ్నిస్తే, విజయసాయిరెడ్డితో శారీరకంగా కలిశానని ఓసారి, ఆయన ద్వారా ఐవీఎఫ్ చేయించుకుని కుమారుడికి జన్మనిచ్చానని మరోసారి చెప్పిందని అన్నారు.
విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శాంతి ప్రసవించిందని, ఆ సమయంలో ఆసుపత్రి రికార్డుల్లో భర్తగా హైకోర్టు న్యాయవాది పోతురెడ్డి సుభాష్ పేరు ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విషయమై సుభాష్‌ను సంప్రదిస్తే, శాంతికి, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారని తెలిపారు. 2016లో విడాకులు ఇచ్చినట్లు శాంతి చెబుతున్న మాటలు అవాస్తవమని మదన్‌మోహన్ స్పష్టం చేశారు. కావాలంటే నిజనిర్ధారణ పరీక్షలకు పంపించవచ్చని, తమ ఇద్దరికి ఇప్పటికే కవల ఆడపిల్లలు ఉన్నారని శాంతి మొదటి భర్త మదన్‌మోహన్ తెలిపారు.
భూదందాల కోసం అడ్డుపెట్టుకున్నారు: ఎంపీ విజయసాయిరెడ్డి, సుభాష్‌రెడ్డి పథకం ప్రకారం దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని లోబరుచుని విశాఖపట్నంలో కోట్ల రూపాయల విలువైన దేవాదాయ భూములను ఆక్రమించుకున్నారని దళిత, గిరిజన, బహుజన సంఘాల నేతలు ఆరోపించారు. శాంతిని అడ్డుపెట్టుకుని భూ దందాలు చేసిన విజయసాయిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై ప్రభుత్వం కేసులు నమోదుచేయాలని, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ జాతీయ నేత మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు.