Employment Abroad With International Driving License :విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార, వాణిజ్య, పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా 2020 తర్వాత ఉన్నత చదువులు, ఉద్యోగానికి అమెరిగా, ఆస్ట్రేలియాలాంటి దేశాలకు వెళ్లేవారి సంఖ్య డబులైంది. ప్రస్తుతం అక్కడ ద్విచక్ర వాహనం, కారు తప్పనిసరిగా మారింది. ఇందుకు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్నవారు ఇక్కడి నుంచే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని వెళ్తున్నారు.
ఎలా పొందాలి అంటే? : అంతర్జాతీయ డ్కైవింగ్ లైసెన్స్ పొందాలంటే మందుగా స్వదేశంలో డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. ఐడీఎల్ దరఖాస్తు సమయంలో ఇక్కడ తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పాస్‌పోర్టు (దాని గడువు కనీసం ఆరు నెలలైనా ఉండాలి), ఏ దేశానికైతే వెళ్తున్నామో దానికి సంబంధించిన వీసా జత చేయాలి. ఒకవేళ వీసా ఆలస్యం అవుతుందనుకుంటే దానికి తగిన ఆధారాలు సమర్పించాలి. ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుడు జారీ చేసిందై ఉండాలి.
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సు కోసం అప్లై చేస్తున్నారా? - ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి - INTERNATIONAL DRIVING LICENSE
అప్లికేషన్‌తో పాటు ఫామ్-ఏ జత చేయాలి. పూర్తి వివరాలతో స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు రుసుం కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. కేటాయించిన తేదీన సంబంధిత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి అవసరమై పత్రాలు అందజేయాలి. వివరాల పరిశీలన తర్వాత అన్ని సరిగ్గా ఉన్నట్లు భావిస్తే ఆర్టీఏ అధికారులు ఐడీఎల్ జారీ చేస్తారు. ఈ లైసెన్స్ సంవత్సరం కాలం వాలిడ్ ఉంటుంది.
మొదటి స్థానంలో కరీంనగర్ :ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ కేంద్రాల్లో జిల్లా రవాణా శాఖ కార్యాలయాలు ఉండగా కోరుట్ల, హుజూరాబాద్, రామగుండంలో యూనిట్ కార్యాలయాలు సేవలందిస్తున్నాయి. వీటి పరిధిలో 2020 వరకు 1741 అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేశాయి. 2020 నుంచి 2024 అక్టోబరు వరకు 5468 మంది ఐడీఎల్ పొందారు. ఐడీఎల్‌లు తీసుకుంటున్న వాటిలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా చివరి స్థానంలో ఉంది.
డ్రైవింగ్ లైసెన్స్ పాత పద్ధతిలోనే - ఆర్టీఏ నయా రూల్స్‌కు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం! - Driving License same as old system
డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆన్లైన్ & ఆఫ్‌లైన్ విధానాల్లో అప్లై చేసుకోండిలా!