Emergency Flight Landing Trail Run on National Highway : బాపట్ల జిల్లా కొరిశాపాడు మండలం పిచ్చికలగడిపాడు వద్ద ఎమర్జెన్సీ రన్‌వేపై ట్రయల్‌రన్ నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై భారత వాయుసేన విమానాలు దిగాయి. గతేడాది రన్‌వేపైకి దిగకుండా విమానాలతో ట్రయల్ రన్ నిర్వహించగా, నేడు రన్‌వేపై విమానాలు దించి ట్రయల్ రన్ నిర్వహించారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ రన్‌వేను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట మధ్య విమానాలు ట్రయిల్ రన్ నిర్వహించారు. 16వ నంబరు జాతీయ రహదారిపై కొరిశపాడు వంతెన నుంచి జే పంగులూరు మండలం రేణింగవరం వరకు 5.1 కి. మీ. మేర ఈ రన్‌వేను నిర్మించారు. రన్‌వేపైకి ఇతరులెవరూ రాకుండా బారికేడ్లు కట్టారు. రాడార్ వాహనంతో పాటు అత్యాధునిక సాంకేతిక వాహనాలను రన్‌వే సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆశ్రమంలో ఉంచారు.
కమీషన్లకు ఆశపడి బోగస్ కంపెనీలకు భారీగా జీఎస్టీ రీఫండ్ - ప్రభుత్వ ఖజానాకు రూ.60కోట్ల గండి
గత ఏడాది రన్ వేపైకి దిగకుండా ట్రయల్ రన్:గత ఏడాది రన్ వేపైకి దిగకుండా కార్గో విమానాలతో ట్రయల్ రన్ నిర్వహించారు. గత ఏడాది చేసిన విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. భారత వాయుసేనకు చెందిన నాలుగు విమానాలు రన్‌వే మీదుగా ప్రయాణించి, కాస్త ఎత్తు నుంచే టేకాఫ్ అయ్యాయి. ఆ సమయంలో రన్‌వేపై విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయో లేదో అని పరీక్షించారు. గత ఏడాది తాత్కాలిక రాడార్ సాంకేతికతంగా సహకరిస్తుందో లేదో అని కూడా పరిశీలించారు. విమానాలు భూమిపై పూర్తిగా ల్యాండ్ అవకుండా కొన్ని మీటర్ల ఎత్తులో ప్రయాణించాయి. రన్‌వే విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు పూర్తి అనువుగా ఉందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.