తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో ఆరో తేదీలోపు బిల్లులు జారీ చేయాలి - విద్యుత్​ సిబ్బందికి ఆదేశాలు - hyderabad zero current bills - HYDERABAD ZERO CURRENT BILLS

Electricity Department Focuses on Zero Current Bill : హైదరాబాద్​ నగరవాసులకు 6వ తేదీలోపే బిల్లులు జారీ చేసేలా విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే డిస్కం సిబ్భందికి తెలిపింది. క్రితం నెలలో 12వ తేదీ వరకు బిల్లులు జారీ చేశారు. ఈసారి మాత్రం 6వ తేదీలోపే బిల్లులు జారీ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Greater Hyderabad Zero Bills
Electricity Department Focuses on Zero Current Bill

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 12:05 PM IST

Electricity Department Focuses on Zero Current Bill :గ్రేటర్ పరిధిలో విద్యుత్​ బిల్లులను ఆరో తేదీలోపు జారీ చేయాలని డిస్కం సిబ్బందిని ఆదేశించింది. మార్చిలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. గృహజ్యోతి సున్నా బిల్లుల జారీ ఎన్నికల కోడ్​తో కొన్ని చోట్ల ఆపేయడం వంటి గందరగోళ పరిస్థితుల్లో 10వ తేదీ వరకు కరెంటు బిల్లులు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో 12వ తేదీన ఇచ్చిన బిల్లులు కూడా ఉన్నాయి. ఏప్రిల్​లో ఎట్టి పరిస్థితుల్లోను 6వ తేదీలోపు పూర్తి చేయాల్సిందేనని క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. సిటీలో గృహ, వాణిజ్య, ఇతరత్రా విద్యుత్తు కనెక్షన్లు 60 లక్షల వరకు ఉన్నాయి. అంటే సగటున రోజుకు 10 లక్షలు బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది.

విద్యుత్తు కార్యాలయాలు ఆదివారమైనా తీరిక లేకుండా పనులు చేశాయి. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో పాస్​లో వివరాల నమోదుకు రాత్రి 7 గంటల వరకు పొడిగించారు. కొత్త పనుల అంచనాలు, ఒప్పందాలు, వర్క్​ ఆర్డర్లు, బిల్లుల క్లెయిమ్స్​, బడ్జెట్​తో ముడిపడిన ఇతర బిల్లుల వివరాలను పాస్​లో నమోదు చేశారు. ఒక్కో సర్కిల్​లో వీటి విలువ ఐదారు కోట్ల దాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఫ్రీ కరెంట్ హామీకి అంతమంది అర్హులా? ఎంత ఖర్చవుతుందో మరి?

Greater Hyderabad Zero Bills :విద్యుత్​ ఉపకేంద్రంలోని పవర్​ ట్రాన్స్​ఫార్మర్​ను మార్చాలంటే చాలా కష్టమైన పని. కొత్తది ఏర్పాటు చేయాలన్నా చాలా తతంగమే ఉంటుంది. ఈ ప్రక్రియను వినియోగదారులకు సాధ్యమైనంత తక్కువ అసౌకర్యంతో ప్రత్నామ్నాయగా కరెంట్​ సరఫరా చేసిన గంటల వ్యవధిలోన జల్​పల్లి ఉపకేంద్రంలో మార్చినట్లు విద్యుత్​ ఇంజనీర్లు చెప్పారు.

అమల్లోకి గృహజ్యోతి స్కీమ్ - అర్హులకు జీరో బిల్లులు అందజేస్తున్న మీటర్ రీడర్లు

ఇక్కడ ఉపకేంద్రంలో 8 ఎంవీఏ సామర్థ్యం కలిగిన పవర్​ ట్రాన్స్​ఫార్మర్​ (పీటీఆర్​) ఉంది. 80 శాతం లోడ్​కు దగ్గరకు చేరుకుంది. పాత దాని స్థానంలో కొత్తగా 12 ఎంవీఏ పీటీఆర్​ను అమర్చారు. దీంతో జల్‌పల్లి, నూరీనగర్‌, శ్రీరాంకాలనీ, గౌస్‌నగర్‌, పహాడిషరిఫ్‌, మామిడిపల్లి ప్రాంతాల్లోని 15వేల వినియోగదారులకు లోడ్​ పెరిగినా ఎలాంటి అంతరాయం ఉందడని సరఫరా చేస్తామని ఇంజినీర్లు చెప్పారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం పేరు మార్పు..

ABOUT THE AUTHOR

...view details