Electric Shock to Walls in the Houses in Anantapur District :అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో గోడలతో పాటు వస్తువులకు విద్యుత్ ప్రవహిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు తెలిపారు. గత ఆరు నెలలుగా ఈ సమస్య ఉందని, విద్యుత్ శాఖ అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.
పలు ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ కట్ చేసుకుని చీకట్లో గడుపుతున్నామని ప్రజలు వాపోయారు. ఇళ్లతో పాటు ఇంట్లో వస్తువులకు విద్యుత్ ప్రవహిస్తుండటంతో పిల్లలకు, పెద్దలకు షాక్ తగిలే ప్రమాదం ఉందని, వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని మోపిడి ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు.