తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎందుకు నిర్లక్ష్యం వహించారు? - ఏపీలో హింసాత్మక ఘటనలపై ఎస్పీలకు ఈసీ సూటిప్రశ్న - EC questioned district SPs

EC Questioned District SPs : రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహించింది. ఈ మేరకు మూడు జిల్లాల ఎస్పీలను పిలిపించుకుని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. హింస జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించింది. వారిచ్చిన వివరణ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి తదుపరి చర్యలు తీసుకోనుంది.

EC Questioned District SPs
EC Questioned District SPs

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 8:21 PM IST

EC Questioned District SPs : ఎన్నికల కోడ్​ అమలులోకి వచ్చిన తర్వాత జరిగిన హింసాకాండపై ఆయా జిల్లాల ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖాముఖి ప్రశ్నించారు. ఉద్రిక్త పరిస్థితులు హత్యలకు దారితీసే వరకూ ఎందుకు నిర్లక్ష్యం వహించారని నిలదీశారు. రాష్ట్రంలో ప్రధానంగా మూడు ప్రాంతాల్లో జరిగిన రాజకీయ హత్యలు, హింసాత్మకం ఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది.

సచివాలయంలో నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లా ఎస్పీలతో సమావేశమైన ఎన్నికల సంఘం హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలు రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి హాజరుకాగా ఆళ్లగడ్డ, గిద్దలూరులో జరిగిన హత్యలు, మాచర్లలో టీడీపీ నాయకుడి కారు తగలబెట్టిన ఘటనలపై ప్రశ్నించింది. అసలు ఈ ఘటనల వెనక ఉన్నది ఎవరు ? హత్యలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటని ఆరా తీసిన ఈసీ, ఎందుకు నియంత్రించలేకపోయారు అని నిలదీసింది.

'ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - మే 13న పోలింగ్, జూన్‌ 4న కౌంటింగ్

నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లా ఎస్పీలతో ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు డీజీ శంఖ బ్రతభాఘ్చి ముఖాముఖీ మాట్లాడారు. రాజకీయ హింస ఘటనలపై ఎస్పీల నుంచి ఎన్నికల ప్రధానాధికారి వివరణ కోరారు. ముగ్గురు ఎస్పీలను విడి విడిగా పిలిచి సీఈఓ(CEO) వివరణ అడిగారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని సీఈఓ ప్రశ్నించారు. రాజకీయ హత్యలు జరిగే వరకు పరిస్థితులు దిగజారే వరకూ ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందనీ సీఈఓ ఎస్పీలను ప్రశ్నించినట్లు సమాచారం.

Election Code Orders : గిద్దలూరు, ఆళ్ళగడ్డలో రాజకీయ హత్యలకు దారి తీసిన ఘటనల వివరాలు ఎన్నికల ప్రధానాధికారి అడిగినట్లు తెలిసింది. మాచర్ల నియోజక వర్గం చాలా కాలంగా సున్నిత ప్రాంతాల జాబితాలో ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారని పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి నీ సీఈఓ మీనా నిలదీశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఎస్పీలను ప్రశ్నించారు. ఏపీలోని శాంతి భద్రతల విషయంలో నేరుగా ఈసీఐ(ECI) నిఘా పెట్టిందనీ స్పష్టం చేశారు. ముగ్గురు ఎస్పీలు ఇచ్చిన వివరణల నివేదికలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల - 34 మందికి ఛాన్స్

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ - ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చ -

సామాజిక మాధ్యమాలు - పార్టీలకు ఇవే బలాలు - ఎన్నికల ప్రచారాలతో హోరెత్తబోతున్న సోషల్​ మీడియా -

ABOUT THE AUTHOR

...view details