ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీతో కలిసి అరాచకాలు - జగన్ వీరభక్త 'బంటు'లపై వేటు - EC TRANSFERS INTELLIGENCE DG AND CP - EC TRANSFERS INTELLIGENCE DG AND CP

EC Transfers Intelligence DG And CP: అధికార వైఎస్సార్సీపీతో అంటకాగుతూ అయిదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్ అధికారులపై ఈసీ ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏకపక్షంగా పని చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయి.

action on ips officers
action on ips officers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 7:00 AM IST

వైఎస్సార్సీపీతో కలిసి అరాచకాలు - జగన్ వీరభక్త 'బంటు'లపై వేటు

EC Transfers Intelligence DG And CP :అధికార వైఎస్సార్సీపీతో అంటకాగుతూ అయిదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్ అధికారులపై ఈసీ ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏకపక్షంగా పని చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయి. వాటిపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది. తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి, తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ వారికి ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించొద్దని నిర్దేశించింది. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్‌ సమర్పించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాల్నే పంపాలని పేర్కొంది.

బాధితులపైనే రివర్స్‌ కేసులు :జగన్‌ భక్త ఐపీఎస్‌లుగా వ్యవహరిస్తున్న నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. విజయవాడ సీపీగా పని చేసస్తున్న కాంతిరాణా టాటా ప్రభుత్వ పెద్దల అండదండలు చూసుకుని ఎగిరెగిరి పడ్డారు. అఖిలభారత సర్వీసు అధికారిననే విషయం మరిచిపోయి అచ్చం వైసీపీ అధికార ప్రతినిధిలా వ్యవహరించారు. ప్రతిపక్షపార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, వారిపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టారు.

ఇంటిలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీపై బదిలీ వేటు - EC transfers Intelligence DG and CP

తెలుగుదేశంలో క్రియాశీల నేతలను లక్ష్యంగా చేసుకుని వేధించారు. ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైసీపీ పట్ల తన విధేయత, స్వామిభక్తిని ప్రదర్శించటంలో కాంతిరాణా వెనక్కి తగ్గలేదు. టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు మీడియాపైన రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదిచ్చారు. తాను కళంకితుడిగా ఉంటూ వైసీపీతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారులందరి తరఫున వకల్తా పుచ్చుకుని మీడియా, ప్రతిపక్షాలపై రాజకీయంగా విషం చిమ్మటం కాంతిరాణాకే చెల్లింది. ఇవే అంశాలతో ఐపీఎస్‌ అధికారుల సంఘం పేరిట ఆయనే ప్రకటన విడుదల చేసేశారు. కానీ అదే ఎన్నికల సంఘం ఆయన వైసీపీతో అంటకాగుతున్నారనే ఫిర్యాదుల ఆధారంగా తాజాగా వేటు వేసింది.

టీడీపీ నేతలపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు :ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన కాంతిరాణా భార్య భువనేశ్వర్‌లో పని చేస్తున్నారు. ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి, వైద్యారోగ్య శాఖలో కీలక పోస్టింగ్‌ ఇప్పించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అన్నట్లు వైసీపీ అరాచకాలకు మరింతగా కొమ్ముకాశారు. అనంతపురం రేంజి డీఐజీగా పని చేసినప్పుడు మంత్రి పెద్దిరెడ్డి చెప్పిందే చట్టం అన్నట్లుగా పని చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను బస్సుల్లో తీసుకొస్తుంటే వారిని అడ్డుకోకపోగా అప్పటి ఎస్పీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయన్ను నిలువరించారన్న ఫిర్యాదులున్నాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాలపై నమోదైన కేసుల్ని నీరుగార్చారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో టీడీపీ శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకుల అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు.

మరో అధికారిపై ఈసీ వేటు - ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ బదిలీ - AP Beverages Corp Ltd MD transfer

జగన్​కు ఓ రూలు - చంద్రబాబుకు మరో రూలు : సీఎం జగన్‌పైకి గులకరాయి విసిరిన ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణం. ఈ వ్యవహారంలో వేళ్లన్నీ కాంతిరాణా వైపే చూపిస్తున్నాయి. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదుచేసిన కాంతిరాణా అందులో టీడీపీ నాయకుల్ని ఇరికించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తద్వారా వైసీపీకు మేలు కలిగించేలా దర్యాప్తు చేశారన్న ఫిర్యాదులున్నాయి. ఈ కేసులో టీడీపీ నాయకుడు వేముల దుర్గారావును అదుపులోకి తీసుకుని నాలుగైదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. ఆయన ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్‌ కార్పెస్‌ పిటిషన్‌ వేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధమవడంతో ఇక తప్పక విడిచిపెట్టారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని దుర్గారావు మీడియాకు వివరించారు. జగన్‌పై గులకరాయి విసిరితే హత్యాయత్నం సెక్షన్‌ పెట్టిన కాంతిరాణా 2022 నవంబరులో నందిగామ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్లతో దాడిచేసిన ఘటనలో మాత్రం వెంటనే కేసు పెట్టలేదు. తర్వాత తప్పనిసరై ప్రమాదకర ఆయుధంతో దాడి కింద కేసు పెట్టేసి మమ అనిపించేశారు. అయినా ఇప్పటికీ నిందితులెవరో గుర్తించలేదు. అంతే కాదు చంద్రబాబుపైకి పూలు వేసినప్పుడు వాటితో పాటు రాయి వచ్చి ఉండొచ్చని ఆ ఘటనపై అప్పట్లో వ్యంగ్యంగా మాట్లాడారు. సీఎం జగన్‌కు పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని ఇటీవల కాంతిరాణాను విలేకరులు ప్రశ్నించగా కాదు, రాయి విసరటం వల్లే జరిగిందని చెప్పారు. అధికార, ప్రతిపక్షాల విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

వైఎస్సార్సీపీ దాడులకు పరోక్షంగా సహకారం : టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైసీపీ నాయకులు హత్యాయత్నానికి తెగబడితే ఆ నాయకులపై ఈగ వాలకుండా కాంతిరాణా కొమ్ముకాశారు. చేత్తో కొట్టటం వల్లే కంటికి గాయమైందంటూ ఆ ఘటనను చాలా తేలిగ్గా తీసిపారేశారు. వెంటనే కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత కూడా తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు. సంకల్పసిద్ధి కేసులో అధికారపార్టీ ముఖ్య నాయకుల్ని తప్పించారన్న ఫిర్యాదులున్నాయి. మంత్రి జోగి రమేష్‌ చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వెళ్తుంటే ఆ సమాచారం ముందుగానే తెలిసీ ఆయన్ను నిలువరించకపోగా పరోక్షంగా సహకరించారన్న విమర్శలున్నాయి. ఇటీవల నందిగామలో టీడీపీ నాయకులపై దాడి జరిగితే రివర్స్‌లో బాధితులపైనే కేసులు నమోదు చేసిన ఘనత కాంతిరాణాదే.

ఫోన్‌ ట్యాపింగ్​పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కొనసాగిస్తున్న అణచివేత, కక్షసాధింపు చర్యలు, అక్రమ కేసుల వెనక మాస్టర్‌ మైండ్‌ నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులేనని ప్రతిపక్ష పార్టీలు ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశాయి. తెరపై ఎక్కడా కనిపించకపోయినా ప్రతిపక్ష నాయకుల్ని ఎవర్ని, ఎక్కడ దెబ్బతీయాలి? వైసీపీ ప్రభుత్వంపై ఎదురుతిరుగుతున్న వారిపై ఎలా సామదానభేద దండోపాయాలు ప్రయోగించాలనే అంశాలపై వ్యూహరచన, అమలు అంతా పీఎస్‌ఆర్‌దేనని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం మొత్తం నిఘావ్యవస్థను, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతల కదలికలు, ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులకు చేరవేయడానికి ఆంజనేయులు ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నారని ఎన్డీయే నేతలు ఇటీవల సీఈసీకి ఫిర్యాదు చేశారు. నిఘా విభాగాధిపతిగా ఆయన్ను కొనసాగిస్తే స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అది మరణశాసనం అవుతుందంటూ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఆయన అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని, వైసీపీ ప్రభుత్వంలో అన్నింటా అగ్ర ప్రాధాన్యం పొందుతున్న ఒకే సామాజికవర్గానికి చెందిన అధికారులతో నిఘా విభాగాన్ని పూర్తిగా నింపేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులన్నింటిపై పరిశీలన జరిపిన ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేసింది.

వైసీపీతో అంటకాగుతున్న కీలక అధికారులు!- చర్యలపై ప్రతిపక్షాల డిమాండ్ - No Actions on Key Officers

ABOUT THE AUTHOR

...view details