Election Commission on CM Jagan Scams in Release of Funds:మోసాలందు జగన్ మోసాలు వేరయా అన్నట్లుగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో చివరిగా మార్చ్ 14న బటన్ నొక్కినా డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు పడలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ 18న అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల పైనే అయ్యింది బటన్ నొక్కి కాని లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ కాలేదు. సాయి రెడ్డి, చెవిరెడ్డి కంపెనీలకు మాత్రం మార్చ్ ఎండింగ్లో 13 వేల కోట్ల రూపాయల బిల్లులకు బటన్ నొక్కేసుకున్నారు. ఎన్నికలకు ముందు పందేరాలు చేసి ఓట్లు వేయించుకుందాం అని ప్లాన్ చేసి అది బెడిసికొట్టడంతో చంద్రబాబు ఆపించాడని వైసీపీ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు స్వయానా ఎలక్షన్ కమిషనే. ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వ మోసాలను బయటపెట్టింది.
పథకాల నిధులు పోలింగ్ తర్వాతే - స్పష్టం చేసిన ఈసీ - EC On Schemes Funds Release
ఈసీ ప్రభుత్వానికి మరో లేఖ: నగదు బదిలీ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం మరో లేఖ రాసింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని ఆదేశించింది. ఒకరోజే నిధుల బదిలీ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికేనని వ్యాఖ్యానించింది.