Andhra Pradesh New DGP :రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇంఛార్జ్ డీజీపీగా ఉన్న శంకర బత్ర బాగ్చీ నుంచి గుప్తా డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయం ఆవరణలో పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. హరీష్ కుమార్ గుప్తా హోంసెక్రటరీగా విధులు నిర్వహించారు. 1992 బ్యాచ్ కి చెందిన హరీష్ కుమార్ గుప్తా గతంలో హైదరాబాద్ కమిషనరేట్ లో జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి, 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో వారికి ఇబ్బందే - చట్టంలో తీవ్రమైన లోపం: విశ్రాంత న్యాయమూర్తి - former CJ on land titling act
ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన్ను డీజీపీగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఇంఛార్జి డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ, ఆ స్థానంలో డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తక్షణం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్ జవహర్‌రెడ్డికి సమాచారం అందించింది.
రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆదివారం బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని కోరగా సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్ హరీశ్‌కుమార్ గుప్తా పేర్లను ప్రభుత్వం పంపింది. ముగ్గురిలో హరీశ్‌కుమార్ గుప్తాను డీజీపీగా ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.
అధికార పార్టీకి భక్తుడిలా రాజేంద్రనాథరెడ్డి: ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రాజేంద్రనాథరెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదులపై చాలా ఆలస్యంగా స్పందించింది. ఎన్నికల్లో వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది.
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసీ వేటు - బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశాలు - EC TRANSFERRED DGP
సీఎం జగన్ డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి మరీ 2020 ఫిబ్రవరి 15న కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించారు. రెండేళ్ల రెండు నెలలుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోం శాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ఆదేశాలను పట్టించుకోలేదు. రాజేంద్రనాథరెడ్డి ‘తమవాడు’ కావటమే ఏకైక అర్హతగా సీనియార్టీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే ఆయన్ను డీజీపీగా నియమించారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో గందరగోళం - జాబితాలో పేర్లు గల్లంతు - చేతులెత్తేసిన ఈసీ - POSTAL BALLOT VOTING ANDHRA PRADESH
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా (ఈటీ వీ భారత్)