ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచార పర్వం - మూగబోయిన మైకులు - Election campaign

Election campaign over in Telugu states: ఏపీ, తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగిసింది, మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఏపీలో ఎల్లుండి 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఎల్లుండి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. జూన్‌ 4న ఓట్ల ఫలితాలు వెల్లడించనున్నారు.

Election campaign over in Telugu states
Election campaign over in Telugu states (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 7:12 PM IST

Election campaign over in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు, ఏపీలో 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు గానూ... ఈనెల 13న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అత్యంత సమస్యత్మాక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు ప్రచారం నిలిపివేశారు. రాష్ట్రంలోని మిగతా 169 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది.

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 90 ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ఎల్లుండి సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎల్లుండి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది.

ఆప్​ను అణిచేందుకు మోదీ యత్నం- ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదల్లేదు: కేజ్రీవాల్ - lok sabha elections 2024

తెలంగాణలో సైతం: 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్‌కు నిర్దేశించిన సమయం ప్రకారమే శనివారం సాయంత్రం ప్రచారానికి గడువు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్, బీజేపీలు (BJP) అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు కేసీఆర్‌ సహా అనేకమంది ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు.

రాష్ట్రంలోని 16 స్థానాల్లో మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతుండగా, హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎం కీలకంగా ఉంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే మూడు పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, సమావేశాలు, రోడ్‌షోలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. కొన్ని ప్రాంతాల్లోనే అభ్యర్థులు ఇంటింటికీ తిరిగారు. ఎండల ప్రభావంతో ఉదయం, సాయంత్రం వేళల్లోనే నేతలు కనిపించారు. చివరి రెండు రోజులు వాతావరణం కొంత చల్లబడింది. ప్రచారంలో మాత్రం వాడీ వేడి పెరిగింది.

రోడ్డు ప్రమాదంలో బయటపడిన డబ్బుల కట్టలు- ఏకంగా ఏడు కోట్లు! - 7 Boxes 7 crore Found in Vehicle

ABOUT THE AUTHOR

...view details