ED Officers on Malla Reddy College for Medical Seats Scam :మెడికల్ పీజీ సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద విక్రయించుకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి సురేందర్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. సీట్ల బ్లాకింగ్ వ్యవహారంపై ప్రశ్నించారు. పీజీ సీట్ల కేటాయింపు రికార్డులు తెప్పించుకుని పరిశీలించిన అధికారులు, తరువాత కళాశాల బ్యాంకు స్టేట్‌మెంట్లను తనిఖీ చేశారు. కాగా కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు నీట్ విద్యార్థులతో కలిసి తెలంగాణాలోని పలు ప్రైవేటు మెడికల్ కళాశాల్లోని పీజీ సీట్లను బ్లాక్ చేస్తున్నారని, తెలంగాణాలోని పీజీ మెడికల్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించే కాళోజీ నారాయణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్ మట్టెవాడ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఈ కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నీట్లో అత్యధిక మార్కులు సాధిందిన వారితో కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తమ కాలేజీల్లో సీట్‌ను ఎంచుకున్నట్లు సృష్టించి, అడ్మిషన్ చివరి రోజు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలా మిగిలి పోయిన సీట్లను ఇస్టిట్యూషనల్ కోటా కింద కోటి నుంచి 2.5 కోట్లకు విక్రయించుకున్నట్లు ఈడీ గుర్తించింది. అయితే సీట్లను రద్దు చేసుకున్నందుకు కట్టాల్సిన రూ.5 లక్షల నష్టపరిహారాన్ని విద్యార్థుల పేరు మీద ఏజెన్సీలు కట్టేసినట్లు ఈడీ గుర్తించింది.