తెలంగాణ

telangana

ETV Bharat / state

బీవీఆర్​ఐటీలో ఈ-రేసింగ్​ పోటీలు- వాహనతయారీలో టాప్​గేర్​లో​ దూసుకుపోతున్న విద్యార్థులు - Racing Competitions in BVRIT

E-Racing Competitions in BVRIT : ప్రస్తుత పోటీ ప్రపంచంలో తక్కువ ధరతో ఎక్కువ నాణ్యతనిచ్చే వస్తువులు, వాహనాలకి గిరాకీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ-రేసింగ్‌ నిర్వహించారు. ఆ పోటీల్లో 2వేల 400 మంది విద్యార్థులు వివిధ ఆకృతుల్లో వాహనాలు స్వయంగా తయారుచేసి పోటీ పడుతున్నారు.

Cars Racing in BVRIT College Narsapur
E-Racing Competitions in BVRIT

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 10:30 PM IST

బీవీఆర్​ఐటీలో ఈ-రేసింగ్​ పోటీలు- వాహనతయారీలో టాప్​గేర్​లో​ దూసుకుపోతున్న విద్యార్థులు

E-Racing Competitions in BVRIT : బీవీరాజు ఇన్​స్టిట్యూట్​ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో(BVRIT College Narsapur) జాతీయ స్థాయిలో 'బాహా' పేరుతో ఈ నెల 6 నుంచి 11 వరకు వివిధ అంశాలపై ఈ-రేసింగ్‌ జరుగుతోంది. దేశంలోని ఎన్​ఐటీ, ఐఐటీ సహా పలు విద్యాసంస్థల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం ద్వారా మరింత జ్ఞానం పొందుతున్నారు. స్వయంగా వాహనాలు తయారుచేయడంతో వాటిలోని లోటుపాట్లు తెలుసుకునే అవకాశం కలిగిందని విద్యార్థులు చెబుతున్నారు.

Cars Racing in BVRIT College at Narsapur : ఇలాంటి పోటీలతో ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలేజీలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో విజ్ఞానాన్ని పెంచుతుందని వాలంటీర్లుగా పనిచేస్తున్న విద్యార్థులు చెబుతున్నారు. వాలంటీర్లుగా ఉండటంతో ప్రతివాహనం పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం లభించడం సహా సదరు వాహనాల శక్తి సామర్థ్యాలు తెలుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"మేము గత మూడు సంవత్సరాలుగా బీవీఆర్​ఐటీ కార్​ రేసింగ్​ పోటీలలో పాల్గొంటున్నాము. ఈసారీ ఎలక్ట్రానిక్ వాహనాన్ని తయారుచేశాము. తరగతి గదులలో నేర్చుకున్నది ఇక్కడ ప్రాక్టికల్​ చేస్తాము. స్వయంగా వాహనాలు తయారుచేయడంతో వాటిలోని లోటుపాట్లు తెలుసుకునే అవకాశం కలిగింది. దీని ద్వారా మాక బయట సంస్థలలో మంచి అవకాశాలు లభిస్తాయి". - విద్యార్థిని

BAHA Racing in BVRIT :2007లో బాహా పోటీలు ప్రారంభంకాగా, అప్పుట్లో కేవలం పెట్రోల్‌తో నడిచేవి మాత్రమే వచ్చేవి. కానీ ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్‌ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఈసారి ఎలక్ట్రానికి వాహనాలు ఎక్కువగా వచ్చాయి. పోటీల్లో పూర్తిగా విద్యార్థులు తయారు చేసిన వాటినే మాత్రమే రేస్‌లోకి అనుమతిస్తారు. ఆ రేస్‌లో గెలుపొందిన వారికి మెుత్తం 36 విభాగాల్లో బహుమతులు ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపు, ఓటములతో కుంగిపోకుండా ముందడుగు వేయాలని పలువురు సూచిస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమంటున్నారు.

"విద్యార్థులకు నేర్చుకున్న సబ్జెక్టును ఆచరణలోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమం నిర్వహణలో వివిధ విభాగాలుంటాయి. కార్లను పూర్తిగా విద్యార్థులే తయారు చేస్తున్నారా? లేదా బయటి వాళ్ల సహాయం తీసుకుంటున్నారా అని పరిశీలిస్తుంటారు. విద్యార్థుల పనితీరును నిరంతరం తనిఖీలు చేస్తుంటారు. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కార్లను తయారుచేసిన వారు రేసింగ్​లో పాల్గొంటారు". - లక్ష్మిప్రసాద్‌, డైరెక్టర్‌, బీవీఆర్‌ఐటీ

Samhita Microsoft Job 52 lakh package : చదువుల తల్లి టాలెంట్​కు మైక్రోసాఫ్ట్ ఫిదా.. రూ.52 లక్షల ప్యాకేజీతో కొలువు

IIT Hyderabad : 'ఓపెన్ టు ఆల్ టీచింగ్'తో.. అందరికీ ఐఐటీ విద్య

ABOUT THE AUTHOR

...view details