Dwacra Community Representative Complained to EC on YCP:వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను బలవంతంగా సిద్ధం సభలకు తరలిస్తోందని డ్వాక్రా సంఘాల ప్రతినిధి సునీత ఆరోపించారు. సభలకు రాక పోతే సంక్షేమ పథకాలు రావని వైసీపీ నాయకులు భయపెడుతున్నారని ఆరోపించారు. అంగన్వాడీ మహిళలకు, డ్వాక్రా సంఘాలకు చీరలు, కుక్కర్లు పెంచిపెట్టడం సహా రక రకాల తాయిలాలు ప్రకటిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు వైసీపీ నాయకులు భయపెట్టిన ఘటనలు, గిఫ్టులు పంచిపెట్టిన ఆధారాలు కూడా ఈసీకి అందచేసినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలను ఓటు బ్యాంకుగా మాత్రమే వైసీపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. అంగన్వాడీ మహిళలను కూడా రకరకాల బహుమతులు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థికే ఓటు వేయాలని, సిద్ధం సభలకు రావాలి అని బెదిస్తున్నారని, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని సీఈఓని కోరినట్లు వెల్లడించారు.