DSP Praneet Kumar Suspension in Call Tapping Case :కాల్ ట్యాపింగ్(Cal Tapping Case) వ్యవహారంలో సస్పెండ్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ కుమార్ సస్పెన్షన్ ఆర్డర్లో కీలక విషయాలు పేర్కొన్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డీఎస్పీగా పని చేస్తున్న ప్రణీత్ గతంలో హైదరాబాద్ ఎస్ఐబీలో పని చేస్తున్న సమయంలో తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించారు.
తన ఎస్ఓటీ బృందం కోసం హైదరాబాద్ ఎస్ఐబీ కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రణీత్ ఏర్పాటు చేసుకున్నట్లు సస్పెన్షన్ ఆర్డర్లో ఉన్నాయి. ఈ తతంగమంతా తానే నడిపినట్లు అధికారులు తేల్చారు. కంప్యూటర్లోని 42 హార్ట్ డిస్క్‌లు సైతం మార్చినట్లు గుర్తించారు. పలువురి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్ డీటైల్ రికార్డ్స్, ఐఎంఈఐ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ రికార్డులను ప్రవీణ్ డిలీట్ చేశారు. ఎలక్ట్రీషియన్ సాయంతో ఎస్ఐబీ భవనంలో సీసీ కెమెరాలు(CC Camera) ఆఫ్ చేయించి హార్ట్ డిస్కులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. కాగా విచారణ పూర్తయ్యే వరకూ అనుమతి లేకుండా డీఎస్పీ ప్రణీత్ హెడ్ క్వార్టర్స్‌ను వీడకూడదని సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొన్నారు.
అన్ కాన్షియస్ అవుతున్నానంటూ అంబులెన్స్‌కి కాల్ - వచ్చిచూసేసరికి సిబ్బందికి షాక్