తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలికలకు డ్రగ్స్​ అలవాటు చేసి రేవ్​ పార్టీల్లో వ్యభిచారం! - జగిత్యాల జిల్లాలో గంజాయి ముఠా అరాచకాలు - drug racket bust in jagtial - DRUG RACKET BUST IN JAGTIAL

Drugs to School Students in Jagtial : జగిత్యాల జిల్లాలో బాలబాలికలే లక్ష్యంగా సాగుతోన్న ఓ గంజాయి ముఠా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులకు డ్రగ్స్​ అలవాటు చేసి, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లి రేవ్ పార్టీల్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఓ బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముఠా కోసం రంగంలోకి దిగారు.

Drugs to School Students in Jagtial
Drugs to School Students in Jagtial

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 3:53 PM IST

Drugs to School Students in Jagtial : రాష్ట్రంలో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్​ నగరానికే పరిమితమైన ఈ మత్తు పదార్థాలు, ప్రస్తుతం గ్రామాలకూ పాకాయి. యువత నుంచి ఇప్పుడు పిల్లలనూ ఈ ముఠాలు తమ వినియోగదారులుగా మార్చుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన బాలబాలికలే టార్గెట్​గా సాగుతున్న డ్రగ్స్, గంజాయి ముఠా అరాచకాలు యాధృచ్చికంగా వెలుగులోకి వచ్చాయి.

ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10 మంది బాల బాలికలను ట్రాప్ చేసి, వారికి గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు అలవాటు చేసి, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లి రేవ్ పార్టీల్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో ఓ బాలిక తల్లిదండ్రులు 20 రోజుల క్రితం తమ కుమార్తె పరిస్థితిని గమనించి, కరీంనగర్​లోని స్వధార్ స్వచ్ఛంధ సంస్థలో చేర్పించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు నేడు జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మద్యం మత్తులో అత్త మామలపై దాడి చేసిన మైనర్​ బాలుడు

వివరాల్లోకి వెళితే జగిత్యాల శివారు చల్గల్​కు చెందిన కొందరు ముఠా సభ్యులు, పాఠశాలలో చదువుకునే మగ పిల్లల ద్వారా మత్తు పదార్థాలు స్కూళ్లోకి చేరవేస్తున్నారు. ఆపై ఆడ పిల్లలకు వాటిని అలవాటు చేసినట్లు తెలుస్తోంది. ఇలా మత్తు పదార్థాలకు బానిసలైన జగిత్యాల పట్టణానికి చెందిన బాలికలను ఇటీవల హైదరాబాద్​లోని ఓ రేవ్ పార్టీకి కూడా తీసుకెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కరీంనగర్​లోని స్వధార్ హోమ్​లో ఆశ్రయం పొందుతున్న బాలిక, మొదట్లో తీవ్ర మత్తులో ఉండేదని, మానసికంగా కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యేదని హోమ్ నిర్వాహకురాలు తెలిపారు.

నీతూబాయికి రూ.4 కోట్ల ఆస్తులు - నానక్​రామ్​గూడ గంజాయి కేసులో విస్తుపోయే విషయాలు

డ్రగ్స్ ముఠాలు పేదింటి ఆడ పిల్లలను ట్రాప్ చేసి, ఇలాంటి కూపంలోకి దించుతున్నాయని స్వధార్​ హోమ్​ నిర్వాహకురాలు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే గంజాయి, డ్రగ్స్, వ్యభిచార ముఠాలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ విషయంలో ఇప్పటికే జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగి, ముఠా కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు సమాచారం.

ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా - మాటువేసి పట్టుకున్న పోలీసులు - Ganja Supplier Arrested In Hyd

ABOUT THE AUTHOR

...view details