Drug Dealer Udoka Stanley Case Update : మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ నేరస్థుడు ఇవాకా ఉడొక స్టాన్లీ(Drug Dealer Stanley) కేసులో సంబంధం ఉన్న వ్యక్తులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈకేసులో మరిన్ని వివరాలు రాబట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఇటీవల అరెస్ట్ అయిన సౌరభ్‌ను ఏడు రోజుల కస్టడీకి కోరారు. గోవా జైలులో ఉన్న ఓక్రా ఆదేశాల మేరకు నెదర్లాండ్ నుంచి వచ్చిన డ్రగ్స్ రిసీవ్ చేసుకుంటున్న సౌరభ్, పూణే నుంచి గోవాలో స్టాన్లీకి అందజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నాలుగు రోజుల క్రితం పోలీసులు సౌరభ్‌ను పుణెలో అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకి తరలించారు. కాగా సౌరభ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే దేశ వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ నెట్‌వర్క్ బయట పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. గోవాలో స్టాన్లీ ఆదేశాల మేరకు డ్రగ్స్‌ను డెలివరీ చేసే ముగ్గురు ట్రాన్స్‌పోర్టర్స్‌ను సైతం పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గోవా జైలులో ఉన్న ఇద్దరు, మరో నిందితుడు క్యాండోలిమ్ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇతని కోసం టీఎస్‌న్యాబ్(TSNAB) పోలీసులు గాలిస్తున్నారు. జైల్లో ఉన్న ఇద్దరిని పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకురానున్నారు. గోవా జైలులో ఉండి అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నడుపుతున్న కీలక నిందితుడు ఓక్రాను సైతం పీటీ వారెంట్‌పై పోలీసులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
డ్రగ్స్ డీలర్ స్టాన్లీ విచారణలో వెలుగులోకి కొత్తకోణం
Nigerian Drug Dealer Stanley :ఈనెల ఫిబ్రవరి 6వ తేదీనపంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తూ స్టాన్లీ పోలీసులకు చిక్కాడు. ఇతని నుంచి దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్ డీలర్లతో అతనికి లింకులు ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో స్టాన్లీకి పుణె నుంచి డ్రగ్స్ చేరుతున్నట్లు తేల్చారు. దర్యాప్తులో భాగంగా స్టాన్లీ కంటే ఓ పెద్ద స్ట్రెంత్ గోవా జైలులో ఉన్నట్లు టీఎస్ న్యాబ్ పోలీసులు గుర్తించారు.
ఏళ్ల తరబడి గోవాలో డ్రగ్స్ దందా నడుపుతున్న నైజీరియన్ దేశస్థుడైన ఓక్రాను గతంలో ఎన్సీబీ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. మూడేళ్లుగా కొల్వాలే సెంట్రల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్న ఓక్రా అక్కడి జైలు అధికారుల సహాయంతో స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నాడు. స్టాన్లీ నుంచి డ్రగ్స్ ఆర్డర్ రాగానే, జైలు నుంచే ఓక్రా నెదర్లాండ్‌లో ఉన్న మరో డ్రగ్ సరఫరాదారుడికి సమాచారం ఇస్తాడు. అక్కడి నుంచి వస్త్రాలు, పెట్టెల మధ్యలో సరకును పెట్టి కార్గో విమానాలు, సముద్ర మార్గాల ద్వారా దేశానికి సరఫరా చేస్తున్నారు.
కమీషన్ కోసం పనిచేసే స్థాయి నుంచి మత్తుదందాలో కింగ్ స్థాయికి - స్టాన్లీ స్టోరీ 'పుష్ప'కు ఏమాత్రం తీసిపోదుగా!
రూ.1100 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్- గోడౌన్లలో దాచిన 600కిలోలు స్వాధీనం