Drivers Protests Against Bharatiya Nyaya Sanhita in Andhra Pradesh :కేెంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 106 పై దేశవ్యాప్తంగా డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా లారీల బంద్ బంద్ చేపట్టారు. రాష్ట్రంలోనూ లారీ డ్రైవర్లు నిరసన బాట పడ్డారు. డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రహదారులపై ఆందోళనలకు దిగారు. దీనివల్ల పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురైంది.
పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద ఆరో రోజు లారీ డ్రైవర్ల ఆందోళన
Drivers Protest in Kurnool District : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 106 ను రద్దు చేయాలంటూ కర్నూలులో (Kurnoo) డ్రైవర్స్ అసోసియేషన్ జాతీయ రహదారిపై నిరసన తెలిపింది. డ్రైవర్ల ఆందోళనతో (Strike) రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డు ప్రమాదం జరిగితే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 7 నుంచి 10 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ కేంద్ర చట్టం తీసుకురావంపై డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చట్ట వ్యతిరేకంగా జీవోలను తీసుకువస్తే దానికి సీఎం జగన్ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోనూ IOC డిపో ఎదుట ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల నిరసనలు తెలిపారు. కేంద్రం తెచ్చిన చట్టంతో డ్రైవర్లు రోడ్డు ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.