Rape On Engineering Student in Ibrahimpatnam :ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. ఇంజినీరింగ్ ఫస్ట్ఇయర్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోయిన బర్రె కోసం వెతుకుతుంటే - ఎవరూ చూడని మానవ మృగాలు బయటపడ్డాయి
బలవంతంగా అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు :వివరాల మేరకు ఇబ్రహీంపట్నంలోని ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న యువతి(18) మంగళపల్లిలోని ఓ హాస్టల్ ఉంటోంది. సెమిస్టర్ ఉండడం వల్ల హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఆటో డ్రైవర్గా పని చేస్తున్న అజిత్ హాస్టల్లోకి చొరబడ్డాడు. బాధితురాలు గదిలో ఒంటరిగా ఉండడం చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు రాత్రి 12.38 నిమిషాలకు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆటోలో అమ్మాయితో అసభ్య ప్రవర్తన - తరువాత ఇంటికొచ్చి ఎత్తుకెళ్లే యత్నం!