Drinking Water Problem Vambe Colony in Vijayawada :విజయవాడ నగర శివారు ప్రాంతంలో దాదాపు 20 వేల మంది వరకు జీవనం సాగిస్తున్నారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత నగర పాలక సంస్థపై ఉంది. కానీ అధికారులు ఆ బాధ్యతను విస్మరించి అక్కడి ప్రజలకు మురికి నీటిని సరఫరా చేస్తుంది. దీంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. గుక్కెడి మంచినీటి కోసం అల్లాడిపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిగులు పనులు పట్టించుకోని జగన్ సర్కార్ - నంద్యాల ప్రజలకు నీటి కష్టాలు - Drinking Water Problem
Vijayawada :విజయవాడ నగరానికి శివారు ప్రాంతమైన బాంబే కాలనీని అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు కాలనీ వాసులు నుంచి వివిధ రకాల పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారు. కానీ వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాలనీలో స్వచ్చమైన మంచినీరు తాగుదామంటే లభించని పరిస్థితి ఉంది. మున్సిపల్ అధికారులు విడుదల చేస్తున్న మంచినీరు పచ్చగా, ఎర్రగా మురికిగా వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నీరు దుర్వాసన కూడా వస్తుందని మహిళలు వాపోతున్నారు. కాలనీలో ప్రతి ఇంటిలో నాలుగైదు సార్లు డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ వంటి రోగాల బారిన పడిన వారు ఉన్నారని తెలిపారు. రోగాల బారిన పడటంతో తాము కష్టపడి సంపాదించిన కూలీ డబ్బుల్లో సగం హస్పిటల్కే ఖర్చు చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలనీలో మంచినీటికి, మురుగు నీటి పారుదలకు ప్రత్యేకంగా వేరు వేరుగా పైప్ లైన్ నిర్మాణాలు చేసినా అవి పాడైపోవడంతో మురుగునీరు తమ నివాసాల్లోకి వస్తుందని మహిళలు వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో పందులు, విష పురుగులు తిరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని స్థానికులు గగ్గొలుపెడుతుంటే, కార్పోరేషన్ అధికారులు పై పైన పనులు చేసి వెళ్లిపోతున్నారు తప్ప శాశ్వత పరిష్కరం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.