Drinking Water Crisis Guntur People Facing Problems :గుంటూరు ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నగరంలో అధికారికంగా 10 లక్షల మంది జనాభా నివిసిస్తుండగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది శివారు కాలనీల్లో జీవనం సాగిస్తున్నారు. నగర పాలక సంస్థ ప్రజలకు తాగునీరు అందించేందుకు సమగ్ర తాగునీటి పథకం కింద 460 కోట్లు, అమృత్ పథకం కింద మరో 33 కోట్లు వెచ్చించినా శివారు కాలనీ వాసులకు మాత్రం దాహార్తిని తీర్చలేకపోతుంది. పాత గుంటూరులోని సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్‌తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు పరిసర కాలనీలైన అన్నపూర్ణ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రగతి నగర్, మదర్ థెరిస్సా కాలనీ, పలకలూరు రోడ్డు, రైలుకట్టలోని ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.
కృష్ణమ్మ చెంతనే ఉన్నా తీరని దాహం - కలుషిత నీరు తాగలేక జనం అవస్థలు - WATER PROBLEM IN VIJAYAWADA
Drinking Water Scarcity : తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శివారు కాలనీ వాసులకు తాగునీరు అందించేందుకు గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. నిధులు కూడా విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజర్వాయర్ పనులను పూర్తిగా నిలిపివేసింది. ఐదేళ్లుగా నీటి సరఫరా గురించి పట్టించుకోని స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల వేళ మాత్రం హడావుడిగా శివారు కాలనీ ఇళ్లకు పైపులైన్ల కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందించారు. పోలింగ్ ముగిసిన వెంటనే నీటి సరఫరా నిలిపివేశారని స్థానికులు వాపోతున్నారు.