హైదరాబాద్లో భారీగా బంగారం పట్టివేత - విలువ రూ.2 కోట్లు - gold seized In Hyderabad - GOLD SEIZED IN HYDERABAD
GOLD SEIZE IN HYDERABAD : కోల్కతా నుంచి హైదరాబాద్ నగరానికి బస్సులో తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. పసిడిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు వెల్లడించారు.
GOLD SEIZE IN HYDERABAD (ETV Bharat)
Published : Jul 7, 2024, 3:21 PM IST
DRI SEIZE GOLD IN HYDERABAD : హైదరాబాద్లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఎత్తున బంగారం పట్టుకున్నారు. సుమారు రూ.2 కోట్లు విలువ చేసే 3982.25 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. కోల్కత్తా నుంచి హైదరాబాద్ నగరానికి బస్సులో బంగారాన్ని తీసుకువస్తున్న ఇద్దరి వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.