Donkey Running Competitions in Vajrakarur: సాధారణంగా రథోత్సవం అంటే దేవతా మూర్తులను రథంపై ఊరేగిస్తారు. కానీ అనంతపురం జిల్లా వజ్రకరూర్లలో జరిగే రథోత్సంలో ఓ ప్రత్యేకత ఉంది. అది అందరిలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రథోత్సవంలో భాగంగా గాడిదల పరుగు పోటీలు: అనంతపురం జిల్లా వజ్రకరూర్లో వెలసిన శ్రీ జనార్ధన వేంకటేశ్వర స్వామి రథోత్సవం ప్రతీ సంవత్సరం వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో ఓ ప్రత్యేకత ఉంది. గాడిదలకు పరుగు పోటీ నిర్వహిస్తారు. గాడిదలపై వాటి యజమానులు కూర్చొని, వాటిని పరిగెత్తిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ పోటీలో గుర్రాలకు తామేమీ తీసిపోమన్నట్టుగా గాడిదలు పరుగులు తీశాయి. ఈ పరుగు పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.
దేవతల పెళ్లిలో పిడకల సమరం - ఏళ్లుగా కొనసాగుతున్న వింత ఆచారం - Pidakala Festival
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహణ : ప్రతీ ఏటా జరిగే శ్రీ జనార్ధన వేంకటేశ్వర స్వామి రథోత్సవంలో రజక సంఘం ఆధ్వర్యంలో గాడిదలకు పరుగు పోటీలు నిర్వహిస్తారు. ఈ గాడిద పోటీలు క్రీడామైదానంలో కాకుండా రోడ్డు మీదనే నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు. వజ్రకరూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం గాడిదల మీద వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ రన్నింగ్ పోటీ నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు అందజేసి, శాలువా కప్పి సత్కరించారు.