Dial Your TTD EO : వైకుంఠ ఏకాదశికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతిలో 91 కౌంటర్ల ద్వారా ప్రత్యేక దర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలిపారు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ఈవో స్పష్టం చేశారు. రద్దీ నేపథ్యంలో భక్తులంతా టీటీడీ సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా భక్తుల సందేహాలకు ఈవో సమాధానం ఇచ్చారు.
తిరుమల భక్తులకు అలర్ట్ - ఆ దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు 10 రోజుల పాటు వసతి కల్పించేలా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, నడక మార్గంలో దర్శనం టోకెన్లు ఇవ్వాలని భక్తులు కోరగా ఈవో సానుకూలంగా స్పందించారు. రైల్వే రిజర్వేషన్ ను 60 రోజులకు తగ్గించిన నేపథ్యంలో ఆర్జిత సేవలు బుకింగ్ సైతం రెండు నెలలకు తగ్గించాలని ఓ భక్తురాలు కోరగా పరిశీలిస్తామని అన్నారు.
తిరుమలలో టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, సన్నిధిలో శ్రీవారి సేవకులు, మహిళా ఉద్యోగులను నియమించాలని కోరగా.. దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఈవో వెల్లడించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రత సిబ్బంది లగేజీని సరిగా చెకింగ్ చేయడం లేదని ఫిర్యాదులు అందాయి. ఆన్‌లైన్ లక్కీడిప్ లో ఇద్దరికి కాకుండా ముగ్గురికి అవకాశం కల్పించాలని కోరగా కష్టమని స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని రాలేనప్పుడు, ఆ టికెట్లను అదే నెలలో మరో రోజు అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని ఈవో సున్నితంగా తిరస్కరించారు. అన్ని రోజుల్లో అన్ని స్లాట్లు బుక్ అయి ఉంటాయి కాబట్టి వీలు కాదన్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జనవరి నెలలో నాలుగు రోజుల పాటు పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 4, 11, 18, 25వ తేదీల్లో ఉదయం శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం తిరిగి సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు.
జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఉంటాయి. జనవరి 13న పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, జనవరి 14న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అమావాస్య సందర్భంగా జనవరి 29న ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ ఉంటుంది.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబు కీలక నిర్ణయం
తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖల ప్రచారాన్ని ఖండించిన టీటీడీ ఈవో