Disorganized Sanitation in Guntur :వీధుల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు. దుర్గంధంతో జనం అవస్థలు. గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పుడిదే అపరిశుభ్రత తాండవిస్తోంది. నగరంలోని అరండల్ పేట, బ్రాడీపేట, కొరిటెపాడు, లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్, మార్కెట్ సెంటర్, పాత గుంటూరు ఇలా, అన్ని ప్రదేశాల్లో చెత్త రోడ్లమీదే ఉండిపోయింది. ఇళ్లు, హోటళ్ల నుంచి సేకరించిన చెత్తను ఆయా ప్రాంతాల్లోని డంపింగ్ స్టాక్ పాయింట్లో పడేస్తున్నారు. నిజానికి అక్కడ నుంచి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి. ఆ పని జరగకపోవడం వల్లే పారిశుద్ధ్యం పడకేసింది.
Sanitation Problem in Guntur :గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 2200 మంది సిబ్బంది శానిటేషన్ విభాగంలో పని చేస్తున్నారు. చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లు, డంపర్ వాహనాలు 130 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా ఈ-ఆటోలను చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు వినియోగిస్తుంటారు. అయితే సుమారు 600 మంది మున్సిపల్ కార్మికులు, సగం వాహనాలను విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు అధికారులు పంపించారు. 22 మంది శానిటేషన్ కార్యదర్శుల్లోదాదాపు 10 మందిని విజయవాడ పంపినట్లు తెలుస్తోంది. గుంటూరులో మెుత్తం 750 చెత్త సేకరణ స్టాక్ పాయింట్లుండగా కేవలం కొన్ని చోట్ల నుంచి మాత్రమే డంపింగ్ యార్డులకు తరలుతోంది. మిగిలిన అన్నిచోట్ల అలాగే పోగుబడింది.