Legislative Council Meetings on Telangana Thalli Statue : తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై శాసన మండలిలో చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సమయంలో ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారన్నారు.
Telangana Council Meetings : తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదని అయన అన్నారు. కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామని చెప్పారు.
కాకతీయులు, మొగల్ సామ్రాజ్యంలో మంచి చెడు రెండూ జరిగాయని,చెడు మరోసారి జరగకుండా చూస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar babu) పేర్కొన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా విగ్రహం తయారు చెయ్యదని, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సింగిల్‌గా నిర్ణయం తీసుకోమని, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక
కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎంతో మంచి పనులు చేశారు. నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గద్దర్ పేరు మీద ఒక జాతీయ స్థాయి అవార్డు ప్రకటించాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గద్దర్‌పై పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, గద్దర్ స్మారక భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.